అధికార పార్టీ కి హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు  ముందే గట్టి  ఎదురుదెబ్బ తగిలింది .  సిపిఐ అనుకున్నంత పని చేసింది . ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపధ్యం లో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కి ఇస్తున్న మద్దతుపై పునరాలోచన చేస్తామన్న ఆ పార్టీ నాయకత్వం ... తాజాగా మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించించి  . ఆర్టీసీ  కార్మికుల సమ్మె పట్ల అధికార టీఆర్ఎస్ నాయకత్వ వ్యవహారశైలికి   నిరసనగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో  ఆ పార్టీకి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం కాకముందే హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో టీఆరెస్ కు మద్దతునివ్వాలని సిపిఐ నాయకత్వం నిర్ణయించించింది .


అయితే ఆర్టీసీ కార్మికులు గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తోన్న నేపధ్యం లో అధికార పార్టీ కి మద్దతు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని భావించిన సిపిఐ , మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది .  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇప్పటివరకు ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చిన   టిఆర్ఎస్ పార్టీ, హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో  సిపిఐ మద్దతు కోరిన విషయం తెలిసిందే.  అధికార పార్టీ అడిగిందే తడవుగా సిపిఐ నాయకత్వం కూడా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేనందుకు  ఓకే చెప్పింది.  అయితే ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి  నుంచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. 


ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల  ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకుండా మొండి వైఖరిని ప్రదర్శించడాన్ని  సిపిఐ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దానికితోడు సమ్మెకు వెళ్ళిన దాదాపు 48 వేల మందికి పైగా కార్మికులు ను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా నిరసిస్తోంది .  ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చే అభాసుపాలు కావడం కంటే మద్దతును ఉపసంహరించుకోవడంతో బెటర్ అనే నిర్ణయానికి వచ్చింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: