పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.  ప్రధాని.. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా  చేతల్లో కూడా చేసి చూపించారు.  ప్రస్తుత మహాబలిపురంలో ఉన్న ప్రధాని శనివారం తెల్లవారుజామున మా మల్లాపురం సముద్రతీరానికి వెళ్లారు.  మామల్లపురం బీచ్ లో  జాగింగ్ వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న చెత్త ను తొలగించానని ,  బహిరంగ ప్రదేశాలను  స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుదా మని...  మనమంతా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందామని మోడీ  ట్విట్టర్ వేదిక  దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు.


  మా మల్లాపురం బీచ్ లో చెత్తను తొలగిస్తున్న వీడియో ను అయన  తన ఖాతాలో పోస్ట్ చేశారు. స్వచ్చ్ భారత్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తున్న విషయం తెల్సిందే . సినీ , రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తూ , ప్రజల్లో అవగాహనా కల్పించే ప్రయత్నాన్ని చేస్తున్నారు .  దేశం లోని అన్ని రాష్ట్రాలు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నాయి . పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి .


ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , స్వచ్చ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి , హైదరాబాద్ నగరాన్ని షాందార్ (సుందర ) నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని చేస్తోంది . స్వచ్చ్ భారత్ కార్యక్రమం లో భాగంగానే బహిరంగ మల, మూత్ర విసర్జన ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు . దేశ వ్యాఫంగా పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణమని కార్యక్రమాన్న్ని కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: