ఆర్టీసీ సమ్మెపై కేసీయార్ వెనక్కు తగ్గకపోతే మూడు రోజుల్లో మద్దతు ఉపసంహరణ చేసుకునే అవకాశం ఐతే ఉందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. . హుజూర్ నగర్ ఉపఎన్నిక మద్దతుపై పునరాలోచిస్తామని త్వరలోనే నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తామని చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని చర్చలు జరిగితే మధ్యవర్తిత్వం వహించడం కొరకు సిద్ధంగా ఉన్నామని చాడ చెప్పారు. 
 
ఆర్టీసీ సమ్మె 8వ రోజుకు చేరుకోవటంతో ఆర్టీసీ కార్మికులు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటున్నారు. చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమ్మె చట్ట విరుద్ధమని చెప్పటం తప్పుడు ప్రకటన అని అన్నారు. ఆర్టీసీ కార్మికులు 6 నెలల ముందు నుండే తమ డిమాండ్ల గురించి చర్చకు పెడుతున్నారని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మరలా అఖిల పక్ష సమావేశంలో పాల్గొంటున్నాయని అన్నారు. 
 
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రకటించిన సమయంలో ఆర్టీసీ సమ్మె లేదని పునరాలోచన చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. మూడు రోజుల తరువాత కమిటీ సమావేశం ఉంటుందని కమిటీ సమావేశం తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఏ సమ్మె అయినా పరిష్కారం కావాల్సిందేనని చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్మికుల సమ్మె కొనసాగుతున్న పక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలపై కసరత్తు చేస్తోంది. 
 
ఆర్టీసీ అధికారుల దృష్టికి తాత్కాలిక కండక్టర్లు ప్రయాణికుల నుండి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. తాత్కాలిక కండక్టర్లు కూడా టికెట్లు ఇచ్చే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆర్టీసీ పాత విధానంలో ముద్రించిన టికెట్లను అధికారులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్, ప్రైవేట్ స్టేజ్ కారియర్లకు అనుమతి మరియు కొత్త సిబ్బంది నియామకం పై కసరత్తు సాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: