గత కొన్ని సంవత్సరాలుగా యువత ఎక్కువగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ పేరుతో శారీరక సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ప్రేమ పేరుతో మొదలైన ప్రయాణం ఆ తరువాత ఎక్కువ శాతం లివింగ్ రిలేషన్ షిప్ కు దారి తీస్తోంది. కానీ ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో యువతలో పెళ్లికి ముందే సెక్స్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. 
 
సమాజంలో సహజీవంపై భిన్నభిప్రాయాలు ఉన్నాయి. కొందరు సహజీవనాన్ని సమర్థిస్తుంటే కొందరు మాత్రం వ్యతిరేఖిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో ప్రేమించిన అమ్మాయితో శారీరక సంబంధం ఉన్నప్పటికీ ఆ అమ్మాయికి బ్రేక్ అప్ చెప్పటం తప్పు కాదని వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు కొంచెం వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ కోర్టు శారీరక సంబంధం ఉన్నా బ్రేకప్ చెప్పటం నేరం కాదని తీర్పు చెప్పింది. 
 
ఢిల్లీకి చెందిన ఒక యువతి ఒక వ్యక్తి ప్రేమించానని చెప్పాడని ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు సందర్భాలలో అత్యాచారం చేశాడని మూడు సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి  గురించి అడిగితే మోసం చేసాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. కోర్టులో యువతి ఇష్టపూర్వకంగానే సంబంధం ఏర్పరచుకున్నానని చెప్పింది. 
 
కోర్టు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం ఏర్పరచుకోవటం పెద్ద నేరం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం శిక్షించదగిన నేరం కూడా కాదని చెప్పింది. యువతి తల్లిదండ్రులు కూడా కోర్టులో తమ కూతురుకు ఆ వ్యక్తితో వివాహం చేయటం ఇష్టం లేదని చెప్పారు. కోర్టు తీర్పు విన్న నెటిజన్లు ఈ తీర్పుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్త్రం చేస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: