నాయీబ్రాహ్మణులును పూర్వంలో ధన్వంతరిలు, ధన్వంతరి బ్రాహ్మణులు, చరకులు, వైద్యుచరకులులు, రాజా వైద్యులు, పండిత రాజులు, మంత్రులు, సంగీత విధ్వంసులు అనే వారు.వైద్యులు అనగా : ప్రతి ఊరిలో, ప్రతి నగరములో నాయీబ్రాహ్మణులు వైద్యం చేస్తు ప్రతి ఊరి ఊరికి తిరుగుతు ఉండే వాళ్ళు వారిని "చరకులు" అనేవారు, చరకులు అనగా ప్రతి ఊరికి తిరుగుతు వైద్యము చేసేవల్లు అని అర్దము, ఈ చరకులు అనే పదము "ఆచర్య చరకుడు" నుండి వచ్చినంది. చరకుడు ఆయన శిస్యులు కలసి ప్రతి ఊరికి తిరిగుతు వైద్యం చేసేవాళ్ళు ఈ విదముగ ఆ పేరు వచ్చింది, ఆ తరువత కాలములో ఆయుర్వేద వైద్యము కోసము క్షవరం అవసరము అయినది ఎందుకనగ ఒక మనిసికి సర్జరి చేయలంటే కచ్చితముగ రోగి శరీరము మీద ఉన్న వెంట్రుకలు తిసివేయలసినదే ఈ విదముగ క్షవర సాంప్రదయము అలవాటు అయినది.


రాజా వైద్యులు, పండిత రాజులు అనగా :ప్రతి రాజ్యములో రాజులకి ఆస్థాన వైద్యులుగ ఉండే వాళ్ళు వాళ్ళని పండిత రాజులు,వైద్య రాజులు,రాజా వైద్యులు అనేవాళ్ళు.మంత్రులు : మంత్రులు అనగా రాజులకి సలహాలు, సూచనలు ఇస్తు ఉండే వాళ్ళు, నాయీబ్రాహ్మణులనే మంత్రులుగా పెట్టుకోవటానికి కారణము,వీళ్ళు అందరికి వైద్యము చేస్తు, క్షవరము చేస్తు ఉంటు ప్రతి మనిషి యోక్క ఆలోచనలను తెలుసుకుంటారు కనుక రాజులు నాయీబ్రాహ్మణులని మంత్రులుగా నియమించుకునేవాళ్ళు.విద్వాంసులు అనగా : సంగీతము అనేది ఆయుర్వేదములో ఒక భాగాము రోగి మనసు వైద్యము చేసెటప్పుడు ప్రశాంతముగ ఉండటనికి వైద్యులే సంగీతమును వాయించేవాల్లు.ఆ తరువతా రాజూల దగ్గర ఆస్తాన విద్వాంసులుగా ఉంటూ రాజుల మన్ననలు పొందే వాళ్ళు.


2000 తర్వాత కాలంలో నేషనల్ నాయీ మహాసభ అధ్వర్యంలో వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న ఈ కులాన్ని "షెడ్యూల్ కులం" గా మార్పుచేసేందుకు ఉద్యమిస్తున్నారు.


నాయీ బ్రాహ్మణుల దసరా ఆత్మీయ సదస్సు(అలయ్‌ బలయ్‌) ఆదివారం ఆబిడ్స్‌లోని హోటల్‌ మందాకిని జయ ఇంటర్నేషనల్‌లో జరగనుంది. నాయీ జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణులు తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్‌, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణుల ఐక్యమత్యానికి, సృహృద్భావ సంబంధాల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: