చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండగా.. సినిమాలకు చాల దగ్గరగా ఉంటున్నాడు. అసలు పాలిటిక్స్ అనే పదముకు చాల దూరంగా వెళ్లిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అని అంటున్నాడు. మరి  ఇలాంటి సమయంలో ఆయన ఉన్నట్లుండి ఎందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పాయిట్‌మెంట్ కోరడంతో రాజకీయ వర్గాల్లో మరియు సినిమా ఇండస్ట్రీలో కూడా చాల సంచలనంగా మారింది.


అసలు ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం చిరుకి ఏముంది..? ఎందుకు ఇప్పుడు ఈయన జగన్‌తో భేటీ అవుతున్నారు అని చాల మంది ఆలోచనలో పడ్డారు.ఇక పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. సమయం దొరికిన అప్పుడుఅల్లా  ప్రతీసారి సీఎంని విమర్శిస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరు, జగన్ భేటీ ఏంటి అంటూ పలు వార్తలు వచ్చాయి.

అన్నింటికీ మించి అక్టోబర్ 11నే అనుకున్న అప్పాయిట్‌మెంట్ కొన్ని కారణాల వల్ల మూడు రోజులు ఆలస్యం కావడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది అందరిలోనూ. ఇప్పుడు చివరికి అక్టోబర్ 14 లంచ్ బ్రేక్‌ సమయంలో  భేటీ అవుతున్నారు జగన్, చిరంజీవి. ఈ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనే విషయం చాలా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో.. ఈ ఇద్దరి భేటీపై కీలకమైన విషయాలు బయటికి తెలిపారుఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.


చిరంజీవి, జగన్ మీటింగ్ వెనక ఎలాంటి రాజకీయ కోణాలు లేవు.. కేవలం సినిమా పరంగానే ఈ చర్చలు కొనసాగబోతున్నాయి అని ఒక క్లారిటీ ఇచ్చాడు. సైరా సినిమా చూడ్డానికి ముఖ్యమంత్రిని చిరు ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నాడని.. అంతే కానీ ఇంకా ఏమి లేదు అని తెలిపారు. అందుకే అప్పాయిట్‌మెంట్ కూడా అడిగాడని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో గవర్నర్ తమిళిసైను కూడా  ప్రత్యేకంగా ఆహ్వానించి షో వేసాడు మెగాస్టార్. ఇప్పుడు జగన్‌కు కూడా తన సినిమాను చూపించాలని అనుకున్నాడు అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: