మూడు రోజుల్లో 100కు 100 శాతం ఆర్టీసీ బస్సులు నడపాలని ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న చర్చను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను గుర్తించదని, ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను చర్చలు జరపదని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇఛ్చారు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే అనధికారికారికంగా విధులకు హాజరు కాలేదని అన్నారు. 
 
సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి మాత్రమే సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని అన్నారు. 50 శాతం బస్సుల రాకపోకలకు వెంటనే సిబ్బందిని నియమించాలని 30 శాతం అద్దె బస్సులకు , 20 శాతం ప్రైవేట్ బస్సులకు స్టేజ్ కేరియర్లుగా అనుమతి ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 19వరకు సెలవులు పొడగిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
 
రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లు, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లను ఉపయోగించుకోవాలని సీఎం చెప్పారు. భారీ వాహనాలు మరియు బస్సులు నడపటం కొరకు అనుభవం ఉన్నవారిని మాత్రమే పనిలోకి తీసుకోవాలని సీఎం చెప్పారు. అధికారులు రాత్రీపగలూ పని చేసి మూడు రోజుల్లో 100కు 100 శాతం బస్సులు నడిచేలా చేయాలని చెప్పారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె వలన, ప్రభుత్వ వైఖరి వలన కొన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
 
సకాలంలో బస్సులు లేకపోవటంతో ప్రజలు విధులకు హాజరు కావటం కష్టమవుతోంది. అత్యవసర సమయాల్లో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం నియమించుకున్న తాత్కాలిక డ్రైవర్ల అనుభవ లోపం వలన కొన్ని చోట్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు ప్రభుత్వ వైఖరి వలన ఇటు కార్మిక సమ్మె వలన సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరి వలన ప్రజలు ఇబ్బందులు పడటం ఎంతవరకు న్యాయం ఇది క్షమించరాని నేరం అని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: