ఆర్థికమంత్రి బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి అవాస్తవాలతో, కాకిలెక్కలు చెబుతూ, రాష్ట్ర ప్రజల్ని పక్కదారిపట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయన మాటలు వింటుంటే,  త్వరలో నే పిట్టకథలమంత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడేమోననే అనుమానం కలుగుతోందని  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి ఎద్దేవాచేశారు.  విద్యుత్‌రంగం విషయంలో, రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై బుగ్గన చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని  బయటపెట్టాయన్న మాల్యాద్రి సమీక్షలపేరుతో కమీషన్లకోసం రాష్ట్రఆర్థిక వ్యవస్థను సర్వనా శనం చేసిన ఘనత జగన్‌సర్కార్‌కే దక్కుతుందన్నారు.

 రూ.16వేలకోట్ల లోటుబడ్జెట్‌, 22.5మిలియయూనిట్ల విద్యుత్‌కొరతలో ఉన్నరాష్ట్రాన్ని మిగులువిద్యుత్‌రాష్ట్రంగా మార్చి, లోటుని భర్తీచేసకుంటూ, అన్నివర్గాల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయించిన చంద్రబాబు పాలనపై అసత్యప్రచారం చేయడంతప్ప, బుగ్గన చేసిందేమీలేదన్నారు. పీపీఏలపేరుతో విద్యుదుత్పత్తి కంపెనీలను రాష్ట్రంనుంచి తరిమేసి, సొంతరాష్ట్రంలో రూ. 4-80పైసలకు లభించే పవనవిద్యుత్‌ని కాదని, రూ.11-68పైసలు పెట్టి, పక్కరాష్ట్రం నుంచి థర్మల్‌విద్యుత్‌ కొంటున్న వైసీపీ ప్రభుత్వం, రాష్ట్రఖజానాకు ఎంతపెద్దచిల్లుపెట్టిందో బుగ్గన సమాధానం చెప్పాలని గురజాల డిమాండ్‌చేశారు. 


టన్నుబొగ్గుని రూ.1600కి సరఫరా చేసేలా మహానదికోల్‌ఫీల్డ్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని కాదని, తెలంగాణలోని సింగరేణినుంచి రూ.3,700లకు టన్ను బొగ్గుని కొనడమేనా బుగ్గనసాధించిన ప్రగతి అని టీడీపీ నేత దెప్పిపొడిచారు. టన్నుకు రూ.2,100లు ఎక్కువచెల్లిస్తున్న జగన్‌ప్రభుత్వం ఈ నాలుగునెలల్లో ఎన్నివేలకోట్లు ఆదాచేసిందో ఆర్థికమంత్రి ప్రజలకు చెప్పగలరా అని  మాల్యాద్రి ప్రశ్నించారు. రూ.1600లకు లభించే బొగ్గునికాదని, రూ.3,700లకు కొనడం ద్వారా రాష్ట్రప్రజల సొమ్ముని పక్కరాష్ట్రానికి ఎంతమేరకు దోచిపెట్టారో రాజేంద్ర నాథ్‌రెడ్డి బహిర్గతంచేయాలని ఆయన డిమాండ్‌చేశారు. భవిష్యత్‌ అవసరాలదృష్ట్యా థర్మల్‌విద్యుత్‌ కన్నా పవన, సౌరవిద్యుత్‌ మన్నికైనది, చౌకైనదని కేంద్ర ఇంధనశాఖామంత్రి ఆర్‌.కే.సింగ్‌ లేఖరాసినా దాన్నిపట్టించుకోకుండా, వచ్చే 25ఏళ్లలో యూనిట్‌థర్మల్‌విద్యుత్‌ రూ.25లు అయితే, పవనవిద్యుత్‌మాత్రం ఇప్పుడులభిస్తున్న రూ.4-84పైసలకే లభిస్తుందని చెప్పినా   వినకుండా ఎవరికి మేలుచేయడానికి బుగ్గన ప్రభుత్వం థర్మల్‌విద్యుత్‌ కొంటోందని గురజాల నిలదీశారు. 


పీపీఏలరద్దుపై కోర్టులు మొట్టికాయలు వేసినా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ పవన, సౌరవిద్యుత్‌పై పనిగట్టుకొని ఎందుకు దుష్ప్రచారంచేస్తుందో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.3వేలకోట్ల రుణంకావాలని ప్రభుత్వం చేసినవిజ్ఞప్తిపై స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎలా స్పందించిందో, బుగ్గనకు తెలియదా అన్నారు. గతప్రభుత్వ ఒప్పందాలను, మీప్రభుత్వం అమలుచేయనప్పుడు, ఇప్పుడు మీరుచేసే ఒప్పందాలను వచ్చే ప్రభుత్వాలు ఎలాఅమలుచేస్తాయని ఎస్‌బీఐ ప్రశ్నించిన మాట వాస్తవం కాదా అని మాల్యాద్రి తెలిపారు. రుణంకావాలంటే, ప్రభుత్వం కూడా హామీదారుగా ఉండాలనే షరతును ఎస్‌బీఐ తనలేఖద్వారా ప్రభుత్వం ముందుంచిందో..లేదో బుగ్గన సమాధానం చెప్పాలన్నారు. 


4నెలల వైసీపీపాలన చూసి, ప్రభుత్వంపై విశ్వసనీయత కోల్పోబట్టే, ప్రపంచబ్యాంక్‌, ఏడీబీ, తాజాగా ఎస్‌బీఐ వంటి బ్యాంకులు వెనక్కువెళ్లాయని టీడీపీనేత స్పష్టంచేశారు. క్రిసిల్‌సంస్థ పవర్‌ఫైనాన్స్‌సంస్థకు డీగ్రేడ్‌ ఇస్తే, దాన్ని కప్పిపుచ్చుతూ ఫిబ్రవరినాటి పాతనివేదికను సాకుగాచూపుతూ, రుణం మంజూరుకు ప్రయత్నించిన నీచచరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని టీడీపీనేత తేల్చిచెప్పారు. గతంలో కాంగ్రెస్‌, వైఎస్‌పాలనలో పేరుకుపోయిన రూ.10వేలకోట్ల విద్యుత్‌బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం 2015లో తీర్చిన సంగతి, బుగ్గనకు తెలియదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 100రోజుల్లోనే కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రాన్ని చీకట్లపాలు చేస్తే, 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 22.5మిలియన్‌యూనిట్లుగా ఉన్న విద్యుత్‌ కొరతను అధిగమించి, 100రోజుల్లోనే 24గంటల నిరంతరవిద్యుత్‌ ఇచ్చింది వాస్తవమో కాదో బుగ్గన తెలుసుకోవాలన్నారు. కడపజిల్లాలోని మైలవరంలో సౌరవిద్యుత్‌ ప్లాంట్‌లోని ఫలకలను ధ్వంసంచేయడంద్వారా వైసీపీ ప్రభుత్వం సౌర, పవనవిద్యుత్‌పై తనకున్న వ్యతిరేకతను నిరూపించుకుందని మాల్యాద్రి చెప్పారు. 


2014లో 9500మిలియ న్‌యూనిట్ల విద్యుత్‌స్థాపిత సామర్థ్యమున్న రాష్ట్రాన్ని, ఐదేళ్లలో 19,600 మిలియన్‌ యూనిట్లకు పెంచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదైతే, వైసీపీ వచ్చిన ఈ 130 రోజుల్లో   నిల్వఉన్న విద్యుత్‌ను వాడేసి, అధికధరలకు బొగ్గుఆధారిత విద్యుత్‌ ఎందుకు కొంటున్నారో బుగ్గన సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో పవన,సౌరవిద్యుత్‌ రంగంలో 7వేల మెగావాట్ల సామర్థ్యమున్న కంపెనీలను ఏర్పాటుచేసి,  రాయలసీమ ప్రాంతంలో 13వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే, ఆయా సంస్థలనే బలితీసుకునేలా వైసీపీ ప్రభుత్వచర్యలున్నాయని గురజాల మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: