తెలంగాణలో ఆర్టీసీ బస్సులను విధిగా రెగ్యులర్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  ప్రతి బస్సుల్లో తాత్కాలిక కండక్టర్లను నియమించింది.  అయితే, తాత్కాలిక కండక్టర్లు బస్సుల్లో టిక్కెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు.  ఇలా డబ్బులు వసూలు చేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు డబుల్ గా వసూలు చేస్తున్నారు.  దీంతో ప్రజలు ఆందోళన చేస్తున్నారు.  


ఈ ఆందోళనతో ప్రభుత్వం దిగి వచ్చింది.  ఇకపై బస్సుల్లో కూడా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  ప్రతి ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు విధిగా టిక్కెట్లు ఇవ్వాలని ప్రభుత్వం రూల్ పాస్ చేసింది.  ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్లు ఇవ్వాలని కండక్టర్లకు ఆర్డర్లు పాస్ చేశారు.  క్రమంగా బస్సులను పెంచడం, ప్రైవేట్, అద్దె బస్సులను  తీసుకురావడంతో కొంతమేర ఇబ్బందులను తొలగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.  


ఇదిలా ఉంటె, ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.  ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలోను ఆర్టీసీ కార్మికులను తీసుకునే సమస్య లేదని చెప్పారు.  ఉద్యోగాల నుంచి ఇప్పటికే వాళ్ళను తొలగించారని, ఇకపై వారితో ఎలాంటి చర్చలు ఉండేది లేదని తెగేసి చెప్పారు.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో  హుజూర్ నగర్ ఎన్నికపై ప్రభావం చూపే విధంగా ఉన్నది.  కార్మికులతో చర్చలు జరపకుంటే.. హుజూర్ నగర్లో మద్దతు ఇచ్చేది లేడనై సిపిఐ చెప్పింది.. 


మరోవైపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తో పాటు వామపక్షాలు సైతం దీనికి మద్దతు ఇస్తున్నాయి.  మరోవైపు హుజూర్ నగర్లో ఆర్టీసీ కార్మికులు కూడా తెరాస కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  కార్మికులు చేపట్టిన ఈ సమ్మెకు ప్రజల నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  ఉద్యోగసంఘాల కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటే కేసీఆర్ కు ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: