అందరికి రైలు ప్రయాణం ఆంటే చాల ఇష్టం. మీరు ఎక్కడికైనా వెళ్లడానికి రైలు టికెట్ బుక్ చేసుకున్నారా? అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తోందా? మీ రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేయకుండా ఇంకొకరి పేరు మీదకు మార్చా  అవకాశం ఇస్తోంది ఐఆర్‌సీటీసీ ఇప్పటి నుంచి. కాకపోతే ఇందుకు కొన్ని షరతులు, నియమనిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఏంటో, మీ పేరు మీద ఉన్న రైలు టికెట్‌ను మరొకరి పేరు మీదకు ఎలా మార్చాలో తెలుసుకుందామా మరి...


 మొదటగా  ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్‌పై ప్యాసింజర్ పేరు మార్చుకునే అవకాశం ఇస్తుంది ఐఆర్‌సీటీసీ. ఇందుకోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకు ఆఫీస్ కి అనుకుంటున్నారా రైలు టికెట్‌పై పేరు మార్చడానికి 'ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్' ప్రింట్ అవుట్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. దాంతో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కూడా కచ్చితంగా ఉండాలి.  ఈ ప్రాసెస్ ని మాత్రం  రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రేల్వే ఆఫీసుకు వెళ్లాలి. రైలు టికెట్‌పై పేరు మార్చుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి. 


మొదట రైల్వే రిజర్వేషన్ ఆఫీసుల్లో రైలు టికెట్‌పై పేరు మార్చడంతో పాటు బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చొచ్చు. పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న టికెట్లకు ఏ నిబంధనలు ఉంటాయో ఇ-టికెట్‌కూ కూడా  అవే నిబంధనలు వర్తిస్తాయి.  రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు సదరు ప్యాసింజర్ సమీపంలోని రైల్వే రిజర్వేషన్ ఆఫీసులో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి ఉంటుంది.


ఇక ప్యాసింజర్ కుటుంబ సబ్యులకు మాత్రమే ఇ-టికెట్‌ను బదిలీ చేస్తారు. మిగతా ఎవరికీ టికెట్లను బదలాయించదానికి అనుమతి ఇవ్వదు ఐఆర్‌సీటీసీ.  మీరు మీ రైలు టికెట్‌ను మీ కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలనుకుంటే 'ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్' ప్రింట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి. ఎవరి పేరుకు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాసింజర్‌కు మీకు ఉన్న సంబంధాన్ని ధృవీకరించే ప్రూఫ్ ఏదైనా కచ్చితంగా  ఉండాలి.  రైలు టికెట్‌పై పేరు మాత్రమే కాదు బోర్డింగ్ స్టేషన్‌ను కూడా మార్చొచ్చు. ఈ మార్పుచేర్పులన్నీ రైల్వే నియమనిబంధనలకు లోబడే ఉంటాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: