ఏపీలో రాజ‌కీయంగా తిరుగులేని విధంగా బ‌లోపేతం కావాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అందుకు త‌గిన విధంగా త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటూ, ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుండ‌గా, ఇప్పుడు జ‌గ‌న్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తూ అధినేత ఆశ‌యాల‌కు గండికొడుతున్నారు. ఓవైపు సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుల‌ను అర్థం చేసుకోలేని నేత‌లు మ‌రోవైపు అందుకు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తూ పార్టీ ప‌రువును బ‌జారున పడేస్తున్నారు.


ఇప్ప‌టికే ఏపీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వ్య‌వ‌హారంతో ఇరుకున ప‌డిన సీఎం జ‌గ‌న్ ఇప్పుడు జ‌గ‌న్ స‌న్నిహితుడు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చేసిన వ్య‌వ‌హారంతో మ‌రింత ఇబ్బంది ప‌డుతున్నాడు. చెవిరెడ్డి చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు ఏకంగా యూట‌ర్న్ తీసుకుని న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టార‌ట‌. ఇంత‌కు అస‌లు విష‌యం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జ‌గ‌న్ ఇద్ద‌రి భేటీపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి పై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు.


ఇది వైర‌ల్‌గా మారి ఏపీలో రాజకీయ దుమారం రేపుతుంది. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌గా ఏపీ సీఎం జ‌గ‌న్ దృష్టికి వెళ్ళింద‌ట‌. దీంతో వెంట‌నే దీనికి న‌ష్టనివార‌ణ చ‌ర్య‌లు తీసుకున్నార‌ట జ‌గ‌న్‌. దీంతో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి వెంట‌నే ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పందించారు. తన పేరుతో ఎవరో తప్పుగా ప్రచారం చేశారని, ఫేస్‌బుక్‌లో తిరుగుతున్న పోస్ట్‌ నేను పెట్టింది కాదు అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎటువంటి గొడవలు లేవని, చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరుతో వైరల్ అవుతున్న వార్తలను చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు.


దీనికి తోడు త‌న‌కు, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుని తాను మెగాస్టార్ పై ఎలాంటి కామెంట్లు చేయ‌లేద‌ని అన్నారు. ఇది టీడీపీ కుట్ర అంటూ చెవిరెడ్డి అన‌డం విశేషం. సో ఏదేమైనా మెగాస్టార్‌పై చెవిరెడ్డి పేరుతో వ‌చ్చిన కామెంట్లు ఎవ‌రు  చేశారో కానీ ఇది చెవిరెడ్డి మెడ‌కు చుట్టుకుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. మొత్తానికి చెవిరెడ్డి చిరంజీవిపై చేసిన కామెంట్ల‌పై యూ ట‌ర్న్ తీసుకోవ‌డంతో రాజ‌కీయ స‌మ‌స్య కు ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్లే.. !


మరింత సమాచారం తెలుసుకోండి: