40 ఏండ్ల రాజ‌కీయం.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, 15ఏండ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేసిన అనుభ‌వం.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే త‌న రాజ‌కీయం నెరిపిన నేత‌. రాజ‌కీయ మ‌హానేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి కి ధీటుగా ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేసిన రాజ‌కీయ ధీరుడు. అదే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉంటే ముఖ్య‌మంత్రిగా ధీటుగానే ప‌నిచేసిన నేత‌. తండ్రి కొడుకుల‌కు ప్రతిప‌క్ష‌నేత‌గా, అధికార ప‌క్ష నేత‌గా ఉన్న ఏకైనా నేత ఎవ‌రైనా ఉన్నారా అంటే అది ఒక్క టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. అయితే మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కి ఎదురొడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న స‌త్తా చూపిన చంద్ర‌బాబు ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు, ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద మాత్రం అంత ప్ర‌తాపం చూప‌లేక పోతున్నాడ‌నే అప‌వాదు లేక‌పోలేదు.


చంద్ర‌బాబు ఎప్పుడు చూసిన పాడిందే పాడ‌రా పాసుప‌ళ్ళ పోషిగా  అన్న చందంగా చెప్పిందే చెప్పి.. తిరిగేసి మ‌రిగేసి చెప్పి చెప్పి చెవుల‌కు తూట్లు పొడుస్తున్నాడు త‌ప్పితే ఇంకో కొత్త ముచ్చ‌ట చెప్పేది లేదు.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆకట్టుకునేది లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు చెపుతున్న దానికి పార్టీలో జ‌రుగుతున్న దానికి పొంతన లేకుండా ఉంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా అన్‌ఫిట్ అనే టాక్ ఇప్పుడు ఏపీలో బ‌లంగా వినిపిస్తుంది. ప్ర‌జా సమ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి, ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మై ఇప్పుడు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెపుతూ త‌న ప‌రువును తానే తీసుకుంటున్నాడు.


ఎప్పుడు చూడు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు మాదిరిగా ఒక్క‌టే స్తోత్క‌ర్ష త‌ప్ప జ‌నాల‌కు అక్క‌ర‌కొచ్చే ముచ్చ‌ట ఏదైనా ఉంటే ఒట్టు అంటున్నారు జ‌నాలు.. నేను హైద‌రాబాద్‌ను క‌ట్టాను అన్న‌దాని నుంచి మొద‌లు పెడితే.. ఇప్పుడు కొత్త‌గా ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కంటివెలుగు ప‌థ‌కం నేను పెట్టిందే వ‌ర‌కు, గ్రామ స‌చివాల‌యాల‌ను నేను ఏర్పాటు చేస్తే జ‌గ‌న్ నేను చేసాన‌ని పెద్ద బిల్డ‌ప్ ఇస్తున్నాన‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబుకు క‌నీసం ఓ సీఎంగా ప‌నిచేసిన నైతిక విలువ‌లు కూడా లేవ‌ని నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్ప‌టిదాక ఏపీలో గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ అస‌లు ఉందా.. ఉంటే ఏమైంది.. ఇక కంటివెలుగు నేను ప్రవేశ‌పెట్టానంటాడు.


ఆయ‌నే ప్ర‌వేశ‌పెడితే ఎక్క‌డ ప్ర‌వేశ‌పెట్టారు చెప్ప‌డు.. జ‌గ‌న్ సీఎంగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై చంద్ర‌బాబు ప్ర‌శ్న‌లు వేస్తాడు... ఏమ‌ని అంటే జ‌గ‌న్ ప‌రిపాల‌న చేసే అధికారం ఆయ‌న‌కు ఎవ్వ‌రిచ్చారు అంటారు.. జ‌గ‌న్‌కు సీఎంగా అధికారం ఎవ్వురు ఇచ్చారో బాబుకు తెలియ‌దా.. చంద్రబాబుకు ఎవ్వ‌రు అధికారం ఇచ్చారో వారే జ‌గ‌న్‌కు అధికారం ఇచ్చారు... ఇది కూడా ఓ ప్ర‌శ్నేనా.. ఇలా ప్ర‌శ్నించ‌డం ఏమైనా స‌బ‌బుగా ఉంటుందా..?  ఈప్ర‌శ్న‌తో జ‌నంలో ప‌లుచ‌న కారా.. ఇక పోలీసుల‌ను చంద్రబాబు హెచ్చ‌రిస్తున్న తీరు చూస్తుంటే ఇంకా చంద్రాలుకు సీఎం ఫోబియో పోన‌ట్లుంది..


ఎందుకంటే ఇంకా పోలీసులు త‌న చెప్పుచేతుల్లోనే ఉండాల‌నుకునే నైజం స‌రికాదేమో.. పోలీసులకు మ‌తిమ‌రుపు అంటాడు..  అంతు చూస్తానంటాడు.. సీఎంగా చూసిన అంతు.. ప్రతిప‌క్ష నేత‌గా కూడా అంతు చూడ‌ట‌మేనా.. ఈ పోలీసులంతా మీరు అధికారంలో ఉన్న‌ప్పుడు ఉన్న పోలీసులే క‌దా.. మ‌రి ఆనాడు మీరు అధికారం  చెలాయించిన‌ప్పుడు ఇచ్చిన శిక్ష‌ణే క‌దా.. అందుకే అంటారు నీవు నేర్పిన విద్యే నీర‌జాక్షి అని.. ఇప్పుడు అట్లాగే ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిప‌క్షాన్ని నానా రాచి రంపాన పెట్టారు.. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలోకి రాగానే మిమ్మ‌ల్ని కూడా అదే పోలీసులు రాచి రంపాన పెడుతున్నారు బాబోరు..


ఇపుడు చంద్ర‌బాబుకు ఓ ఫోబియో ప‌ట్టుకుంది.. తానే సీఎంను.. అనిపించుకోవాల‌ని.. అందుకే ఇటీవ‌ల మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు చంద్ర‌బాబును మీరే ఏనాడైనా సీఎం అని అని బ‌ట్రాజులాగా పొగ‌డ‌గానే చంద్రబాబు చాతీ జానేడు జ‌రిగింది.. రొమ్ములు విరుచుకుని ఇగో నేనే సీఎంను అనేంత బిల్డ‌ఫ్ ఇచ్చారు.. అంటే ఇంకా సీఎం హోదాలోనే ఉన్నాన‌నే ఫోబియో చంద్రబాబును వ‌ద‌ల‌లేదు.. అందుకే చంద్రబాబును చూసి ఏపీ ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు.. పాపం బాబుగారి ప‌రిస్థితి జాలేస్తుంద‌ని ఏపీ ప్ర‌జ‌లు సానుభూతి చూపుతున్నారు. ఈ సానుభూతిని ఐదేండ్లు పొందితే త‌ప్ప చంద్ర‌బాబుకు మ‌ళ్ళీ రాజ‌యోగం ప‌డుతుంది.. లేకుంటే గిట్ల‌నే పిచ్చి తుగ్లక్ లెక్క పిచ్చిపిచ్చి వాగుడు వాగాడ‌నుకో.. ఇక చంద్రాలుకు శంక‌ర‌గిరి మాన్యాలు త‌ప్ప‌వు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: