వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పదుల సంఖ్యలో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారు.  ఈ పధకాల వలన అనేక మందికి లబ్ది చేకూరుతుంది.  పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పధకాలు అందాలనే  లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఇలా చేస్తున్నది.  ఇక జగన్ విజయం సాధించిన ఆయనకు వేలమంది శుభాకాంక్షలు తెలిపారు.  జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు,ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. 


అలా ఆహ్వానం అందుకున్న వాళ్లలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.  కానీ, జగన్ ప్రమాణస్వీకారానికి పవన్ వెళ్ళలేదు.కారణం, రాష్ట్రంలో జగన్ కు పవన్ వ్యతిరేకం.  కేవలం ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  పవన్ వెళ్లడం లేదు కాబట్టి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్ళలేదు.  ఒకవేళ వెళ్తే.. పవన్ కు వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటుంది అని భావించి వెళ్ళలేదు.  


కాగా, సైరా సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రోజుకు ఆరుషోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.  ఇది నిర్మాత రామ్ చరణ్ కు లబ్ది చేకూరే అంశం కాబట్టి చిరంజీవి ఇప్పుడు రామ్ చరణ్ తరపున జగన్ ను కలవబోతున్నారు.  సైరాకు లబ్ది చేకూర్చినందుకు థాంక్స్ చెప్పబోతున్నారు దీంతో పాటు ఈ సినిమా చూడాలని, అలానే స్వాతంత్ర సమరయోధుడు కథ తో తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమాకు వినోదపన్ను రాయితీగా ఇవ్వాలని కోరే అవకాశం ఉన్నది.  


మెగాస్టార్, జగన్ ల మధ్య కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.  మరే విషయాల గురించి కూడా చర్చించే అవకాశం లేనట్టుగా సమాచారం.  ఇక ముఖ్యమంత్రి ఇంట్లో భేటీ కాబోతున్నారు కాబట్టి చిరు, చరణ్ లకు జగన్ లంచ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.  అంతేకాదు, సినిమాలు సంబంధించి టాలీవుడ్ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు కూడా ప్లాన్ జరుగుతున్నాయి.  కాబట్టి దీనిపై కూడా కీలక నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: