తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని కలిపేయాలంటూ కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజురోజుకూ సమ్మె తీవ్రమవుతోంది. చివరకు ఆర్టీసీ కార్మి్కులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుండటంతో... పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు పోయాయన్న బాధలో ఉన్న కార్మికులకు... సెప్టెంబర్ జీతాలు కూడా ప్రభుత్వం ఇవ్వకుండా నిలిపేయడంతో సమ్మె మరింత ఉద్ధృత రూపం దాల్చుతోంది.

తమ కార్యాచరణలో భాగంగా... ఆదివారం రోడ్లపై వంటా వార్పూ చేసిన కార్మికులు... నేడు డిపోల ముందు బైఠాయించనున్నారు. ఒక్క బస్సు కూడా డిపోల నుంచీ కదలకుండా చేస్తామని ప్రతిన బూనారు. నేడు జరగబోయే ఆర్టీసీ కార్మికుల సభలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా ఇవాళ ఖమ్మంలో బంద్ చేస్తున్నారు. ఈ బంద్‌కి ప్రజలు మద్దతివ్వడంతో... షాపులు, హోటళ్లు అన్నీ బంద్ అయ్యాయి.


శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ సూసైడ్లతో సమ్మె మరింత తీవ్రతరం అయ్యింది. ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు, ఉద్యమ సంఘాలు, ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. చివరకు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతిచ్చాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఒంటరి అవుతోంది. మంత్రులు మాత్రం... కేసీఆర్ నిర్ణయమే సరైనదని చెప్పేందుకు ప్రయత్నించి... ఆర్టీసీ కార్మికుల ఆగ్రహాన్ని చూస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని కరీంనగర్‌లో కార్మికులు ముట్టడించడమే అందుకు ఉదాహరణ. ఇవాళ్టి నుంచీ మంత్రుల్ని కూడా ఎక్కడికక్కడ నిలువరించాలని జేఏసీ పిలుపివ్వడంతో సమ్మె మరింత ఉద్ధృతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  గారు ఆర్టీసీ కార్మికుల వినపాలని కొట్టిపారేశారు వారితో ఎటువంటి చర్చలు జరగవు అని సపస్సాచటం చేసారు .ఈ పరిమాణం తావరలో జరగబొయేయ్ హుజూర్నగర్ ఎన్నికలో ప్రభావం చూపుతుంది అని తెరాస కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: