పార్టీలు మారే అలవాటు ఉన్న నాయకులు ఉన్నంత కాలం ఎవ్వరు ఏం చెయ్యలేరు అధికార దాహం కోసం ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాలలో త్వరలో మార్పులు చోటు చేసుకుంటాయని పెద్ద చర్చ నడుస్తుంది. ఏదో ఒక పార్టీలోనే ఉండాలని దగ్గుపాటి ఫ్యామిలీ విషయంలో వైసీపీ అల్టిమేటం ఇచ్చిన నేపధ్యంలోనే మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తుంది.

దగ్గుపాటి కి అల్టిమేటం జారీ చేసిన నేపధ్యంలో ఆయన జగన్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలని డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల ముందు వైసీపీలోకి చేరి చక్రం తిప్పాలని,చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూసిన దగ్గుపాటి వెంకటేశ్వర్ రావు ఊహించని విధంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు దగ్గుపాటి ఆయన తనయుడు హితేష్ చెంచురాం . హితేష్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని మొదట భావించినా హితేష్ చెంచురాం పౌరసత్వానికి సంబంధించిన సమస్య రావటంతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. ఎప్పుడూ ఓటమి అంటే ఏమిటో తెలియని దగ్గుపాటి ఓటమి పాలయ్యారు.గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ నుండి పోటీ చేసి కూడా ఆయన ఎదురు దెబ్బ తిన్నారు. ఇక అప్పటి నుండి దగ్గుపాటికి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.దగ్గుపాటి వల్ల పార్టీలో కీలక నేతలు ఇబ్బంది పడుతున్నారన్న వార్తల నేపధ్యంలోనే వైసీపీ ఆయన విషయంలో అల్టిమేటం జారీ చేసి సీరియస్ గా నిర్ణయం తీసుకుంది.ఇక బీజేపీలో ఉన్న పురంధరేశ్వరిని పార్టీ మార్చాలనివైసీపీలోకి తీసుకురావాలని దగ్గుపాటిపై ఒత్తిడి తెస్తుంది వైసీపీ.కానీ పురంధరేశ్వరి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీని వీడి వైసీపీ లోకి వచ్చే ఆలోచనలో లేరు అని కూడా స్పష్టం అవుతోంది. చూద్దాం భర్య పార్టీలోకి భర్త వెళ్తారా లేక భర్త చెంతకే భార్య వస్తుందా అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: