ఆర్టీసీలో నెల‌కొన్ని స‌మ్మెను.. కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ మెత్త‌బ‌డి మెట్ట‌దిగుతున్నారా...? ఆర్టీసీ కార్మికుల చావు చూస్తే త‌ప్ప కేసీఆర్‌లో చ‌ల‌నం రావ‌డం లేదా.. తెలంగాణ ఉద్య‌మంలో ఎంద‌రినో పొట్ట‌న పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతు,  ఆర్టీసీ కార్మికుల‌ను కూడా పొట్ట‌పెట్టుకుంటున్నాడ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ ప్ర‌జ‌లు తెగించి కొట్లాడితే ఎట్లా ఉంట‌దో రుచి తెలిసిన కేసీఆర్ మ‌రోమారు తెలంగాణ పోరు రుచి చూస్తున్నారు. తాను ఉద్య‌మం చేసే స‌మ‌యంలో కార్మికులంద‌రిని వేనోళ్ళ పొగిడిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం త‌నదైన నియంతృత్వంతో ఆర్టీసీ కార్మికుల స‌మ్మెను అణిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.


అందుకే ఆర్టీసీ కార్మికులు తెగించి పోరాడుతున్నారు.. కేసీఆర్ కూడా స‌మ్మెపై ఉక్కుపాదం మోపుతున్నారు. కార్మికులను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనికి స‌మ్మె మ‌రింత ఉదృతం అయింది. అంతే కాదు.. ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. క‌దం తొక్కుతున్నారు.. ఇదే సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాల‌కు పాల్ప‌డుతున్నారు. మ‌రో తెలంగాణ ఉద్య‌మం ఊపందుకుంటుంది.. దీంతో క‌ళ్ళు తెరిచిన కేసీఆర్ మెల్కొంటునట్లు క‌నిపిస్తున్నార‌ట‌.. ఎందుకంటే ఆర్టిసీ స‌మ్మె మ‌రింత ఉదృతం అయితే త‌న ఉనికికే ప్ర‌మాదం వ‌స్తుందని గ్ర‌హించార‌ట‌.. అందుకే తెలంగాణ టీఎన్‌జీవో సంఘం నేత‌ల‌కు తాయిలాలు ఇచ్చి త‌న‌వైపుకు లాక్కున్నారు.


అంతే కాదు ఇప్పుడు త‌న అనుచ‌ర‌గ‌ణంతో కేసీఆర్ గొప్ప నేత‌గా కీర్తించుకుంటూ ఉద్య‌మాన్ని ఆపాల‌ని, కేసీఆర్ ఆర్టీసీ ప్ర‌భుత్వ ప‌రం చేయకుండా మిగ‌తా అన్ని డిమాండ్ల‌ను అంగీక‌రించాల‌ని స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నం టీ ఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కే.కేశ‌వ‌రావు ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి అన్ని డిమాండ్ల ప‌రిష్క‌రించాలని స్టేట్‌మెంట్ ఇప్పించారు. అంటే కేసీఆర్ తెర‌వెనుక ఉండి.. తెర‌ముందు త‌న నేత‌ల‌తోని స్టేట్‌మెంట్లు ఇప్పించడం చూస్తుంటే ఇదో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తుంది.


తానే ఉద్య‌మ నేత‌ల‌ను చ‌ర్చ‌ల‌కు పిలిస్తే ప‌లుచ‌న అవుతాన‌ని గ్ర‌హించి ఇలా నేత‌ల‌తో స్టేట్‌మెంట్లు ఇప్పించి వారిని మ‌రోమారు చ‌ర్చ‌ల‌కు ర‌ప్పించి, డిమాండ్ల‌ను నెర‌వేర్చి అది త‌న పార్టీ ఖాతాలో వేసుకునే రాజ‌కీయ ఎత్తుగ‌డ రాజ‌కీయ ప‌రిశీల‌కు అంచ‌నా వేస్తున్నారు. సో కేసీఆర్ కొంత మెత్త‌బ‌డి ఓ మెట్టుదిగి స‌మ్మెను విర‌మించేలా మ‌రోమారు చ‌ర్చ‌ల‌కు పిలిచే ఆలోచ‌న చేస్తున్నార‌న్న మాట‌..


మరింత సమాచారం తెలుసుకోండి: