ఆంద్ర ప్రదేశ్ లో  తెలుగుదేశం పార్టీ వర్సెస్ పోలీసులు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది . తెలుగుదేశం పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసు అధికారుల సంఘం నాయకులు తీవ్ర విమర్శలే  గుప్పిస్తున్నారు . అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం తో  పోలీసులు తమ పార్టీ నాయకులు , కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని  ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం తెల్సిందే . పల్నాడు లో చోటు చేసుకున్న పలు సంఘటనలను ఆయన ఈ సందర్బంగా  ఉదహరించారు .


 పల్నాడు లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని, దాంతో వారు గ్రామాలను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి నెలకొందని వాపోయారు .  కొంతమంది పోలీసులు అధికార పార్టీ కి కొమ్ము కాస్తూ ఈ తరహా చర్యలకు దిగుతున్నారని  టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు . పోలీసులపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలపై పోలీసు అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అదే స్థాయి లో స్పందించారు . పోలీసులపై అవాకులు , చవాకులు వెళుతోన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని  పోలీసు అధికారుల సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు .


 పోలీసులపై ఎవరైనా అసత్య ప్రచారం చేసిన, దూషించిన వారిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు . పోలీసుల జాతకాలాన్ని తన వద్ద ఉన్నాయంటున్న,  వర్ల రామయ్య జాతకం కూడా తన వద్ద ఉందని శ్రీనివాస్ అన్నారు .  తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టీడీపీ నేతలు, పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని పోలీసు అధికారుల సంఘం ప్రధానకార్యదర్శి  మస్తాన్ ఖాన్ మండిపడ్డారు . పోలీసుల విమర్శించడం ఫ్యాషన్ అయిందని , పోలీసు వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పని చేయదని చెప్పారు .


మరింత సమాచారం తెలుసుకోండి: