ఒకే ఒక ఎలుక ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి షాక్ ఇచ్చింది. ఈ ఎలుక దెబ్బ‌తో చివ‌ర‌కు ముఖ్య‌మంత్రే స్వ‌యంగా త‌న స‌మీక్షా, స‌మావేశాల‌ను కొంత సేపు వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. మ‌రి ఎలుక దెబ్బ‌కు త‌న స‌మీక్షా స‌మావేశం వాయిదా వేసుకున్న ఆ ముఖ్య‌మంత్రి ఎవ‌రో కాదు క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్‌.యుడియార‌ప్ప. మ‌రి యుడియార‌ప్ప‌ను ఆ ఎలుక అంతెలా ఇబ్బంది పెట్టింది ? ఈ క‌థేంటో చూద్దాం.


ఎలుక చచ్చిందని ఏకంగా ముఖ్యమంత్రి కాక్యక్రమాలను మార్పు చేయాల్సిన పరిస్థితి సోమవారం బెంగళూరు విధానసౌధలో చోటుచేసుకుంది. విధాన సౌధ‌లోని శ‌క్తికేంద్రంలో సీఎం త‌న స‌మీక్షా, స‌మావేశాలు నిర్వ‌హిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మూడో అంత‌స్తులోని 313 నెంబ‌ర్ గ‌దిలో అధికారుల‌తో కీల‌క స‌మీక్ష‌లు జ‌రిపేందుకు రెడీ అయ్యారు.


యుడియార‌ప్ప సమీక్ష‌కు వ‌చ్చే స‌రికే అక్క‌డ‌కు ప‌లువురు కీల‌క అధికారులు వ‌చ్చి కూర్చొన్నారు. ఎలుక చ‌చ్చి దుర్వాస‌న వ‌స్తుండ‌డంతో వాళ్లు ఆ కంపు భ‌రించ లేకుండా ఉన్నారు. బ‌య‌ట‌కు వెళ్లిపోదామా ? అంటే సీఎం స‌మీక్ష ఉంది. ఈ టైంలోనే అక్క‌డ‌కు సీఎం వ‌చ్చారు. యుడియార‌ప్ప కూడా ఆ వాస‌న భ‌రించ‌లేక‌పోయారు. ప‌క్క‌నే ఉన్న ఆ గ‌ది నిర్వాహ‌కులు, అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోయారు.


వాళ్లు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా మరోమాట మాట్లాడితే బాగుండదని విధినిర్వహణలో అంత నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత గది శుభ్రం చేయాలని హెచ్చరించారు. చివరకు యడియూరప్ప నేరుగా సీఎం పేషీకు చేరుకుని సమీక్షలు సాగించారు. బెంగ‌ళూరు విధాన సౌధ‌లో ఎలుక‌ల బెడ‌ద ఎక్కువుగా ఉండ‌డంతో వాటిని నియంత్రించేందుకు ప్ర‌తి యేటా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నా ఫ‌లితం ఉండ‌డం లేదు. మ‌రి ఇప్ప‌ట‌కి అయినా ఈ విష‌యంలో దృష్టి పెట్టి ఎలుక‌ల‌ను పూర్తిగా నియంత్రిస్తే విధాన సౌధ ప‌రువు కాపాడిన వారు అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: