లోకేష్ తిండి  ఖర్చు ప్రభుత్వ ఖాతాలోనా ? అది కూడా ఈ రేంజ్ లోన అంటూ విమర్శలు వినిస్పిస్తున్నాయి. మొన్న ఈ మధ్యనే ఇలాంటి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. లోకేష్ మరియు ఇతర రాజకీయ సంబంధిత సభ్యుల యొక్క  తిండి ఖర్చు కూడా ఏపీ ప్రభుత్వం ఖాతాలోకే రాశారని, అది ఇప్పటికీ బకాయిగానే ఉందని వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. వివరాలు లోకి  వెళ్ళితే  విశాఖ ఎయిర్ పోర్టులో లోకేష్ కి ప్రత్యేక ఖాతా ఉందట. దాంట్లో భారీగా తినుబండారాలు  అయినా  చెకోడీలు, చాక్లెట్లు,బర్గర్లు లాంటివి చాలానే లాగించారంట.


ఇప్పుడు ఆ బకాయీ మొత్తం  అక్షరాలా పన్నెండు లక్షల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ పై దాడి కేసులో వినిపించిన హర్షవర్దన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ సంస్థలో లోకేష్ పేరిట ఖాతా ఉండటం.ఇప్పుడు ఆ ఖాతాలో పన్నెండు లక్షల రూపాయల బకాయీ ఉందని, దాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
 విశాఖ ఎయిర్ పోర్టులో లోకేష్ వెళ్లినా, మహా అయితే  గంట లేదా  రెండు గంటలు ఉండి ఉంటారు.


అలాంటప్పుడు ఉన్న ఆ కాసేపు సమయం లోనే   ఏకంగా పన్నెండు లక్షల రూపాయల స్నాక్స్ బిల్లు చేసారు  అంటే, అంతలా ఆయన ఏం తిన్నారు? ఎలా తిన్నారు? ఏకంగా పన్నెండు లక్షల రూపాయల బిల్లు చేయడం ఏమిటో.. అంటూ  నెటిజన్లు   ఆశ్చర్యపోతూ పోస్టులు,కామెంట్లు  చేస్తున్నారు. ఇదివరకు కూడా ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు,మరియు ఆయన  కుటుంబ ఏ సభ్యులు ఏ రేంజ్ లో దోచుకుందో  ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే  ఉన్నాయి.


అప్పట్లో చంద్రబాబు నాయుడు కుటుంబం హైదరాబాద్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసి, దాని బిల్లును  ఏపీ ప్రభుత్వం ఖాతాలోంచి కట్టించిన ఘనతను దక్కించుకున్నారు. తరువాత హైదరాబాద్ లో తన ఇళ్ల రిపేర్ల  సొమ్ముని  కూడా ఏపీ ప్రభుత్వం ఖాతా నుంచి కట్టించారని, ఇలాంటి ఘనత చంద్రబాబు నాయుడు మాత్రమే దక్కించుకోగలరని ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో లోకేష్ కూడా చేరారని విమర్శల వర్షం కురిపిస్తున్నారు అందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: