నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకాన్ని మంగళవారం ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు కుటుంబానికి రూ.13500 చొప్పున పెట్టుబడి సాయం అందజేయనున్నారు. ఐదేళ్లపాటు ఈ సాయాన్ని కొనసాగిస్తానాని  వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖరారు చేసింది. కౌలురైతులకు కూడా ఈ రైతు భరోసా పధకం లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం పేరు విషయంలో గతంలో జగన్‌పై విమర్శలు గుప్పించిన కన్నా.. తాజాగా ఏపీ సీఎంపై ప్రశంసలు కురిపించారు..

ఈ పథకానికి జగన్ సర్కారు మొదట ‘వైఎస్ఆర్ రైతుభరోసా’గా నామకరణం చేయగా.,, కేంద్రం రూ.6 వేలు ఇస్తుండటంతో.. దానికి ప్రధాని పేరు పెట్టాలని కన్నా డిమాండ్ చేశారు. గతంలో బాబును స్టిక్కర్ సీఎంగా విమర్శించిన బీజేపీ నేత.. ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నారని ఆరోపించారు. దీంతో జగన్ ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్‌గా పేరును మార్చారు.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కన్నా కూడా ఆమోదించినట్లు సమాచారం. భాజాపా ప్రభుత్వం సైతం రైతులకు అందించే కేంద్ర నిధులు రూ.6000 కు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి "YSR రైతు భరోసా-PM కిసాన్"గా ఇవ్వడం హర్షణీయం.. గత సర్కారులా కాక ఇకపై కేంద్రం నిధులతో ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి పేరు తప్పనిసరిగా జత చేసి లబ్ధిదారులకు అందచేయాలి’’ అని కన్నా ట్వీట్ చేశారు.

ఏది ఏమైనా జగన్ పదవి చేపట్టిన కొన్ని నెలల వ్యవధిలోనే ఇలాంటి ఎన్నో పధకాలను ప్రవేశపెట్టి ..,, ప్రజలకు ఎన్నో రకాలుగా అడగకుండానే సాయం అందిస్తున్న తన స్వభావం తన తండ్రిని గుర్తు చేస్తున్నట్టు కొందరి అభిప్రాయం.,, కాగా ప్రతిపక్షాలు మాత్రం అతని వైఖరిని చూసి ఓర్వలేక తప్పులు లెవదీసే ప్రయత్నం లో ఉన్నారు.. కానీ వీటన్నిటికీ కనీసం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి మాత్రం తను చేయాలి అనుకున్నది చేసి చూపిస్తున్న వైఖరి ఆంధ్ర పౌరులకు తెలిసిన విషయమే..

మరింత సమాచారం తెలుసుకోండి: