హైదరాబాద్ కేంద్రంగా నక్సల్స్ తో ప్రభుత్వం జరిపిన చర్చలకు 15 సంవత్సరాలు నిండాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలోని దికుష్ అతిధి గృహంలో విడిది ఏర్పాటు చేశారు. అక్కడ గడిపినన్ని రోజులు ప్రభుత్వ అతిధులుగా  మర్యాదలందుకున్నారు. వాళ్ళు కబడితే చాలు ఏంకౌటర్ చేయడానికి చేసే పోలీసులు నక్సల్స్ బందోబస్తు నిర్వహించడం విశేషం.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ చర్చలు మొదలెట్టి సరిగ్గా 15 సంవత్సరాలు పూర్తయింది. పీపుల్స్ వార్, జనశక్తి నేతలు నేరుగా హైదరాబాద్ లోని ఎం సి ఆర్ హెచ్ ఆర్ డిలో ప్రభుత్వంతో చర్చలు జరిపారు.



2004 అక్టోబర్ 15  ఉదయం 10-30 గంటలకు. పీపుల్స్ వార్ నేతలు రామకృష్ణ, సుధాకర్, కళ్యాణరావు, గణేశ్; జనశక్తి నేతలు అమర్ , రియాజ్ లు హాజరయ్యారు.  ప్రభుత్వం తరఫున హోమ్ మంత్రి కె జానారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మునిసిపల్ మంత్రి దివంగత  కోనేరు రంగారావు, సాంఘిక సంక్షేమ మంత్రి రెడ్యానాయక్, కాంగ్రెస్ నేతలు కె కేశవరావు, మర్రి శశిధర్ రెడ్డి, టి పురుషోత్తం రావు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. నాలుగురోజుల పాటు సామరస్యపూరిత వాతారణంలో చర్చలు జరిగాయి.  2004 అక్టోబర్ 18వ తేదీ వరకూ దీర్ఘంగా చర్చలు సాగాయి. అయినప్పటికీ ఉభయుల మధ్య ఇతమిత్థంగా ఒక అంగీకారం కుదరక ప్రయత్నం విఫలమైంది. అది వేరే విషయం.
ఇదంతా ఎందుకు గుర్తుచేయాల్సివచ్చిందనేగా మీ సందేహం.



ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గత పదకొండు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమై చర్చల అంశం తెరపైకి వచ్చింది. అందులోను ఈ చర్చలను నిర్వహించడానికి గానూ  ప్రభుత్వం తరపున కేకే మధ్యవర్తిత్వం వహిస్తారన్న అంశమే మీడియా వర్గాలకు ఒక్కసారిగా గతంలో జరిగిన చర్చలు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో  చర్చల వార్తలు సేకరించడంలో రేయింబళ్లు  తల మునకలైన విలేఖరులందరూ - రాజకీయనాయకులు కామన్ గా వేసుకున్న జోకు. "కేశవరావు, జానారెడ్డి, ధర్మాన.. మాట్లాడేది ఏళ్ల తరబడి వింటున్న మనకే అర్ధంకానప్పుడు,  వీరు మాట్లాడింది పాపం అడవుల్లో నుంచీ వచ్చిన పిడబ్ల్యుజి - జనశక్తి నేతలకు ఒక్క ముక్క అర్ధమైతేగా..  వారికి ఏమర్ధమవుతుందీ.." అన్నది కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: