తాళి కట్టిన భర్త వేధిస్తున్నాడంటూ ప్రియుడితో కలసి తుండుగుడ్డతో గోతునులిమి చంపిన ఓ భార్య ఉదంతమిది. ఈ సంఘటన హైదరాబాద్ ఎల్బీనగర్‌ పరిధిలోని బీఎన్‌రెడ్డినగర్‌ వెంకటేశ్వరకాలనీలో సంభవించింది. పోలిసుల కధనం ప్రకారం కట్టుకున్న భర్తను చేచేతుల చింపిన వైనమిది. నల్గొండ జిల్లా, నేరెడుచర్ల మండలం, పందిరిగుండు తండాకు చెందిన పలావత్‌ ప్రసాద్‌బాబు(38), సరోజ దంపతులకు ఇద్దరు సంతానం. బతుకుదెరువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చి ఆటో నడుపుతూ కుటుంబంతో ఎల్బీనగర్‌ పరిధి బీఎన్‌రెడ్డినగర్‌ వెంకటేశ్వరకాలనీలో ఉంటున్నాడు.


చిట్టీల వ్యాపారంలో నష్టం రావడంతో గుప్త నిధుల కోసం ప్రయత్నించాడు. ఈక్రమంలో దాదాపు రూ.40లక్షలు అప్పు చేశాడు. గ్రామంలో ఉన్న ఎకరన్నర భూమిని అమ్మి రూ.25లక్షల వరకు అప్పులు తీర్చాడు. మిగిలిన అప్పుల బాధ పెరగడంతో నిత్యం ఇంటికి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరోజ కొంతకాలం పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో దేవరకొండ మండలం, బొడ్డుపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ నర్సింహ(30)తో సరోజకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత పెద్దలు నచ్చజెప్పడంతో సరోజ పుట్టింటి నుంచి భర్త వద్దకు వచ్చింది. అప్పుల బాధతో ప్రసాద్‌ ఇంటికి రావడం తగ్గించడంతో నర్సింహ బీఎన్‌రెడ్డి నగర్‌కు వచ్చివెళ్లేవాడు. తనను భర్త వేధిస్తున్న విషయం ప్రియుడికి చెప్పడంతో ఎలాగైన ప్రసాద్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో  భాగంగానే  నర్సింహ, రామకృష్ణలను సరోజ ఇంటికి పిలిపించింది.



తనకు తెలిసిన వాళ్లని, ఫైనాన్స్‌ ఇస్తారని చెప్పి పరిచయం చేసింది. వాళ్లిద్దరు ప్రసాద్‌తో కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా నర్సింహ, రామకృష్ణలు అతని మెడకు టవల్‌ను చుట్టి గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత తన భర్త మృతి చెందాడని అందరినీ నమ్మించింది. కానీ కుటుంబసభ్యులు మృతదేహంపై గాయాలున్నట్లు గమనించడంతో వనస్థలిపురం పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ హత్య జరిగిన సమయంలో లక్ష్మణ్‌ నగరంలో లేకపోవడంతో.. సరోజను మరోసారి గట్టిగా విచారించడంతో అసలు నిజం చెప్పింది. సరోజతోపాటు, నర్సింహ, రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: