హైకోర్టు సూచనలు కేసీఆర్ సర్కార్  చెవికెక్కినట్లు లేదు . అందుకే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేది లేదని ఖరాఖండిగా తేల్చి చెబుతోన్న ప్రభుత్వం , కొత్త ఎండీ నియమించాలని చేసిన సూచనను కూడా తిరస్కరించింది . ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని , సంక్షోభ పరిస్థితుల్లో నూతన ఎండీ ని హడావుడిగా నియమించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది .


ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె అసంబంధమైనది న్యాయస్థానం లో బలంగా వాదించాలని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 44  శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని , అలాగే 16 ఐఆర్ ప్రకటించడం జరిగిందని ఈ విషయాన్ని న్యాయస్థానానికి విన్నవించాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యం లో 150  కోట్ల నష్టం వాటిల్లిందని , ఇది పూడ్చలేని లోటు అని , అయినా కార్మికులు సంస్థ  ఆర్ధిక పరిస్థితి గురించి ఆలోచించకుండా సమ్మెకు వెళ్లాయని ఉన్నతస్థాయి సమావేశం లో కేసీఆర్ వ్యాఖ్యానించారు . అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల నేపధ్యం ఈ రోజు కేసీఆర్ ప్రచార సభ లో పాల్గొననున్నారు .


ఉప ఎన్నికల ప్రచార వేదిక కేసీఆర్ , ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ఏమి చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది , ఇన్నాళ్లూ ఉన్నత స్థాయి అధికారుల  సమావేశం లో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై తన వైఖరి చెబుతూ వచ్చిన  కేసీఆర్ , ఈ రోజు  ఎన్నికల సభలో  తన వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది .ఆర్టీసీ కార్మికుల సమ్మె పై కఠినంగా వ్యవహరించడం వల్ల ఉప ఎన్నికలో అధికార టీఆరెస్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది . ఈ తరుణం లో కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠ గా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: