కర్నూలు జిల్లాలోని సిద్దాపురం గ్రామంలోని పాఠశాలకు పిల్లలు ఉన్నా పాపం టీచర్లు కరువయ్యారు.  ఈ సిద్దాపురం పాఠశాలలో గతంలో ఇద్దరు టీచర్లు ఉండేవారు.  అయితే, ఈ ఇద్దరిలో ఒకరిని అక్కడి నుంచి బదిలీ చేయడంలో ఇప్పడు ఒక్కరే టీచర్ అయ్యారు.  దీంతో పాఠశాల విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉన్నారు.  ఈయన ఆధ్వర్యంలోనే స్కూల్ నడుస్తున్నది.  ఒక్కరితో స్కూల్ ను నడపడం అంటే మాములు విషయం కాదు.  


చాలా కష్టం అవుతుంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి స్కూల్ కు రాలేకపోతే ఆరోజు స్కూల్ మొత్తం బంద్ పెట్టాల్సిందే.  వేరొకరు స్కూల్ లో ఉండరు.  స్కూల్ పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవడం కష్టంగా ఉందని, మరో టీచర్ ను సిద్దాపురం స్కూల్ కు పంపించాలని పాపం ఆ స్కూల్ టీచర్ మొరపెట్టుకుంటున్నారు.  ఆ టీచర్ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక మీడియాను ఆశ్రయిన్చారు.  


స్కూల్ లో చాలామంది పిల్లలు ఉన్నారని, ఒక్కరే అన్ని క్లాసులు చూసుకోవడం కష్టం అవుతుందని ఆయన అంటున్నారు.  కనీసం మరొక టీచర్ అయినా ఉండాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నా కుదరరడం లేదని పాపాం ఆ టీచర్ అంటున్నాడు.  స్కూల్ పిల్లలు సైతం ఒక్కరే ఉపాద్యాయుడు కావడంతో తన చదువు సరిగా సాగడం లేదని అంటున్నారు.  మరొక టీచర్ కావాలని కోరుతున్నారు.  


సిద్దాపురం గ్రామం జనాభ రెండువేలకు పైగా ఉన్నది.  ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య వండవరకు ఉన్నది.  అంతమందికి ఒక్కరే టీచర్ అంటే చాలా కష్టం.  వందమందిని కంట్రోల్ చేయడం మాట అటుంచితే.. అందరికి పాఠాలు చెప్పాలి అంటే ఎంతటి కష్టంగా ఉంటుందో ఊచించుకోవచ్చు.  ఎవరు ఏ తరగతిలో ఉన్నారు.  ఎవరు ఏమి చదువుతున్నారో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: