ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. అడిషనల్ కౌంటర్ కాఫీని ప్రభుత్వం దాఖలు చేసింది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, డిమాండ్లను తీర్చే పరిస్థితి లేదని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. ప్రభుత్వం ఇప్పుడున్న కార్యదర్శి మంచి అనుభవజ్ఞుడని అందువలన కొత్త ఎండీని నియమించలేదని చెప్పింది. హైకోర్టు మాత్రం కొంచెం ఘాటుగానే స్పందన వ్యక్తం చేసింది. 
 
ప్రభుత్వం ఎందుకు పట్టుదలకు పోతుందని, కొత్త ఎండీని నియమిస్తే నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు ఉన్న కార్యదర్శి సునీల్ శర్మ అనువజ్ఞుడు అయితే ఆయననే ఆర్టీసీ ఎండీగా నియమించమని ప్రశ్నించింది. ప్రభుత్వానికి కార్మికుల ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తామని ఎందుకు హామీ ఇవ్వలేదని ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కొరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని న్యాయమూర్తిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యల గురించి హైకోర్టు ప్రశ్నించిందని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ లో సమ్మెలతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని హైకోర్టు గుర్తు చేసింది. సమ్మె నివారణకు పరిష్కారం చూపకపోతే మరిన్ని సమస్యలు తలెత్తవచ్చని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎండీ నియామకం, హెచ్ ఆర్ ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవని హైకోర్టు పేర్కొంది. 
 
రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉద్యోగ సంఘాలు, క్యాబ్ డ్రైవర్లు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లుగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ ప్రజల అవసరాలకు తగినట్లు ఏర్పాటు చేశామని చెప్పగా ప్రభుత్వ వాదనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలు శక్తివంతులు, వారు తిరగబడితే ఎవరూ ఆపలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మికులకు ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వటానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: