ప్రస్తుత ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలకమయిన నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది.తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటినుండి, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం లేదు,తమ ఇష్టానికి  విరుద్ధంగా విభజన జరగటంతో,జూన్ 2న అవతరణ దినోత్సవం జరుపుకోవటం మానేశారు ఏపీలోని ప్రజలు,మరియు దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అంగీకరించలేదు అనే వార్తలు ఉన్నాయి.


మాజి ముఖ్యమంత్రి  అయిన చంద్రబాబు నాయుడుగారు,ఇందుకు బదులుగా జూన్ 2 నుండి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు చేస్తూ వచ్చారు.కానీ ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో,పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్  అవతరణ దినోత్సవంపై సీఎం జగన్,ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని,ఎప్పటినుండో ప్రచారం  జరుగుతూ వస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే,ఏపీ అవతరణ దినోత్సవంపై ఓ నిర్ణయం తీసుకుంటామని పాదయాత్ర సమయంలో  వైఎస్ జగన్ ప్రకటించారు.



దీనికి  తగ్గట్టు ప్రస్తుతం,ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు.వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలో, తెలియజేయాలి అని మాజి ముఖ్యమంత్రి  చంద్రబాబు హయంలో ప్రభుత్వ అధికారులు మరియు కేంద్ర హోం శాఖను కోరినట్టు సమాచారం ఉంది. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ  స్పందిస్తూ,ఆంధ్ర ప్రదేశ్ గతంలో లాగానే నవంబర్‌ 1న, అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.



గతంలో  విడిపోయిన నాలుగు రాష్ట్రాలు,విభజన జరిగిన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం ఇదివరకు ఉన్న అవతరణ తేదీ నాడే  దినోత్సవాలను  జరుపుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కాని ఆంధ్ర ప్రదేశ్లో గత ప్రభుత్వం మాత్రం,అవతరణ దినోత్సవం జరుపుకునేందుకు అసలు ఆసక్తి చూపలేదు. ఎలా అయితేనేమి,ఐదేళ్లుగా  ఉన్న ఏపీ అవతరణ దినోత్సవం పెండింగ్  వేడుకలు,ఇప్పటికైనా  జరగడం ఖరారు అంటున్నారు రాజకీయ వర్గాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: