వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా అనేక పధకాలు రూపొందిస్తున్నారు.  ఒకదాని తరువాత మరొకటిగా పధకాలు ప్రవేశపెడుతూ..ప్రజలకు ఉపయోగపు పనులు చేస్తూ మంచి సీఎం.. మనసున్న సీఎం గా పేరు తెచ్చుకుంటున్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగల కోసం గ్రామ వలంటీర్ల పోస్టులను క్రియేట్ చేసి దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు.  అలానే, గ్రామ సచివాలయ ఉద్యోగాలు కల్పించారు.  


వీటితో పాటుగా అనేక పధకాలు కల్పిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పథకంతో మొదలుపెట్టిన జగన్, ఆ తరువాత అందరికి చేరువయ్యేలా పధకాలు రూపొందిస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు అండగా ఉంటున్నారు.  అలానే ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలకు ఆటో కోసం ఇస్తున్నారు.  పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నది.  


ఈ కార్యక్రమం త్వరలోనే పూర్తి కాబోతున్నది.  ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ లోని 22 లక్షల మంది లబ్ది దారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారు.  కేవలం ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు.  ఇదిలా ఉంటె, ఇప్పుడు జగన్ మరో కొత్త పధకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.  అదే ఆరోగ్య శ్రీ.  అదేంటి ఆరోగ్యశ్రీ ఉన్నది కదా మరలా కొత్త పధకం అని షాక్ అవ్వకండి.  


ఆ ఆరోగ్యశ్రీనే ఇప్పుడు పరిధి పెంచారు.  మాములుగా ఏపీ లో ఉన్నవాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వైద్యం చేయించుకోవడానికి వీలు ఉన్నది.  కానీ, ఇప్పుడు ఆ పరిధిని పెంచారు.  హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 150 హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోడానికి వెసులుబాటు కల్పించబోతున్నారు.  నవంబర్ 1 నుంచి ఈ పధకం అమలులోకి రాబోతున్నది.  ఆంధ్రప్రదేశ్ కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్లకు నెలకు అక్కడి నుంచి బయటకు వచ్చే వరకు నెలకు రూ. వేలరూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు.  ఇది మంచి వార్తే అని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: