జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో అందరికంటే ముందు ఉంటున్నారు.  ప్రతి నిర్ణయం కూడా ప్రజల కోసమే అన్నట్టుగా నిర్ణయాలు ఉంటున్నారు.  ఇసుక విషయంలో తప్పించి అన్ని సక్సెస్ అయ్యాయి.  ఇక ఇదిలా ఉంటె, టెండర్లు విషయంలో చాలా సీరియస్ ఉన్న ఉంటున్న సంగతి తెలిసిందే.  ప్రతి వందకోట్ల రూపాయల టెండర్ ను జ్యుడిషియల్ రివ్యూ చేయిస్తామని గతంలో చెప్పారు జగన్.  


చెప్పినట్టుగానే ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూకు ఆదేశించారు.  దేశంలో మొదటిసారిగా జ్యుడిషియల్ రివ్యూకి ఆదేశించిన ప్రభుత్వంగా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు.  రాష్ట్రంలో 108, 104 వైద్య సేవల కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది.. వీటిని ప్రివ్యూకు పంపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. .  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే 108 కి ఫోన్ చేస్తారు.  క్షణాల్లోనే కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్ వస్తుంది.  హాస్పిటల్ కు తీసుకెళ్తుంది.  అందులోనే కొంతమేరకు వైద్యసహాయం అందుతుంది.  ఇలాంటి 108, 104 ఒక్కో అంబులెన్స్ నిర్వాహణకు నెలకు సుమారు రూ. 1.35 లక్షలు అవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం 600కు పైగా అంబులెన్సులు అందుబాటులో ఉండగా.. మరో 700కు పైగా అంబులెన్సులను సిద్దం చేయాలని నిర్ణయం తీసుకుంది.

వీటి మొత్తం నిర్వహణ వ్యయం దాదాపుగా రూ. 100 కోట్లు దాటిపోతుంది.  దీంతో టెండర్లును జ్యుడిషియల్ రివ్యూ చేయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.  జ్యుడిషియల్ ప్రివ్యూ వైద్య ఆరోగ్యశాఖను దీనికి సంబంధించిన వివరాలను కోరింది.  దీనికి సంబంధించిన ప్రివ్యూ వెబ్ సైట్ ను ఇటీవలే జగన్ ప్రారంభించారు.  దానికి సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు.  ఈ ప్రివ్యూ ప్రాసెస్ ప్రకారం ఇకపై ఏదైనా టెండర్ రూ.100 కోట్లు దాటితే.. జడ్జి టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతారు. అలాగే సాంకేతిక విభాగం నుంచి సలహాలు, సూచనలు, వివరాలు తీసుకోవచ్చు. టెండర్ల విషయంలో జడ్జి చేసే సిఫార్సులను సంబంధిత శాఖ కచ్చితంగా పాటించాలి. జడ్జి 8 రోజులు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. పలు సూచనలు, సలహాలు ఇస్తారు. మొత్తం ఈ విధానంలో 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదనను ఖాయం చేస్తారు. 


రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి టెండర్ ను ఇలా రివ్యూ చేయడం వలన పారదర్శకంగా ఉంటుందని జగన్ ఆలోచన.  ఎక్కడ అవినీతి జరగకుండా ప్రతిదీ సక్రమంగా జరగాలని గతంలోనే జగన్ పేర్కొన్నారు.  అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మరచాలన్నది జగన్ ఆశయం.  అందుకే గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇలా పారదర్శకంగా అన్ని పద్ధతిప్రకారంగా చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: