ఈరోజు శనివారం.. సాఫ్ట్ వేర్ వాళ్లకు సెలవు.. కాబట్టి పెద్దగా పర్వాలేదు.  మాములు ప్రజానీకం బయటకు వెళ్లే సమయంలో కాస్త చూసుకొని వెళ్లడం మంచిది.  ఎందుకంటే.. తెలంగాణలో బస్సుల బంద్ జరుగుతున్నది.  ఒక్క బస్సును కూడా రోడ్డెక్కనివ్వమని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు.  కార్మికులతో పాటుగా అనేక ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ జేఏసీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తూ, సంఘీభావం తెలుపుతూ బంద్ ను పాటిస్తున్నాయి.  


అయితే, ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా చూస్తామని, బంద్ సక్సెస్ కానివ్వమని అంటోంది.  దీంతో ప్రజలకు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  సొంతవాహలు ఉన్న వ్యక్తులైతే సరే.. కానీ, మాములు ప్రజా రవాణాలో తిరిగే వ్యక్తులకు ఇది చాలా కష్టంగా మారుతుంది.  ఎందుకంటే.. బస్సులు, క్యాబ్ లు, ఆటోలు అన్ని బంద్ అయ్యాయి.  బహుశా పెట్రోల్ బ్యాంకులు కూడా బంద్ ఉండొచ్చు.  


షాపులు మూతపడే అవకాశం ఉన్నది.  సో, పూర్తిగా అన్ని బంద్ అయిన పక్షంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  కాబట్టి ప్రజలు కాస్త చూసుకొని బయటకు వెళ్లడం మంచిది.  హైదరాబాద్ నగరంలో సైతం బంద్ ప్రస్తుతం ప్రశాంతగా సాగుతున్నట్టు సమాచారం.  ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను అన్నిచోట్లా మోహరించారు.  పోలీసుల సహకారంతో ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.  


తెలంగాణలోని పట్టణాల్లో మాత్రం ఒక్క బస్సు కూడా రోడ్డుపైకి వచ్చినట్టు దాఖలాలు లేవు.  బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.  ఈ ఉదయం 10:30 గంటల సమయంలో ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించింది.  మరి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతుండగా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.  చాలా చోట్ల ఆర్టీసీ కార్మికులను, నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.  నేతలను అరెస్ట్ చేసినా బ్యాండ్ మాత్రం యధాతధంగా కొనసాగుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: