ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులను వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేపని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలను ఇవ్వాలన్న కృతనిశ్చయంలో సర్కారు ఉంది. ఈ క్రమంలో ఈ ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలకు ఇంటి స్థలం మంజూరు చేసేందుకు ప్రభుత్వం సర్వసన్నర్ధమవుతుంది. ఈ తరుణంలో ఇంటి స్థలం మంజూరుకు కావాల్సిన అర్హతలను ప్రభుత్వం రూపొందించింది. నివేశన స్దలాలకు నియమాలు ఇలా ఉన్నాయి. 


గ్రామంలో ఇంటి నివేశన స్థలం లేని నిరుపేదలను ఈ క్రింది విధంగా గుర్తించాలి.
1.తెల్ల   రేషన్ కార్డ్ ఉండాలి
2.ఆధార్ కార్డ్ ఉండాలి
3.ఓటర్ కార్డ్ ఆ గ్రామంలోనే ఉండాలి.
4.స్వంత ఇంటి స్థలం ఉండరాదు.
5.స్వంత ఇల్లు ఉండరాదు.
6.ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి.
7.కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు.
8.మాగాణి 2.50, మెట్ట 5 ఎకరాల లోపు ఉండవచ్చు.
9.గతంలో  ప్రభుత్వం వారు ఇంటి స్థలం  మంజూరు చేసి ఉండరాదు.
10.గతంలో ప్రభుత్వం వారు హోసింగ్  లోన్ మంజూరు చేసి ఉండరాదు.
11.గతంలో ప్రభుత్వం వారు ఎల్ ఏ లో లబ్దిదారుడై ఉండరాదు.
12.గతంలో ప్రభుత్వం నుండి పొజిషన్ సర్టిఫికెట్ పొంది ఉండరాదు.



13.లబ్దిదారుని తండ్రి పేరు మీద స్థలం ఉన్నచో లబ్దిదారుడు ఒక్కడే వారసుడు ఉన్నచో తదనంతరం సదరు ఇల్లు గాని ఇంటి స్థలం గాని అతనికే చెందును. కాబట్టి లబ్ది దారునికి ఇంటి స్థలం ఇవ్వవలసిన అవసరం లేదు
14.ఒక కుటుంబం నకు సుమారు 5 సెంట్ల ఇంటి స్థలం కలిగి ఉండి ఆ కుటుంబం లో ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నచో అటువంటి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరుకు పరిగణలోకి తీసుకొనరాదు.
15.ఇతరులకు కేటాయించిన ఇంటి స్థలంలను కొని అందులో నివాసం ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకోరు. ఈ విధంగా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను సిద్ధం చేసింది. ఈ మేరకు సొంత ఇల్లు లేని  వారంతా ఉగాదికి నివేశన స్థలాలను పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: