పశ్చిమ గోదావరిలో,జనవరి 1 నుండి పైలెట్‌ ప్రాజెక్టు పేరుతో కొత్త ఆరోగ్యశ్రీకి  పలు  మార్పులను చెయ్యాలని,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2వేలు,మిగిలిన అన్ని జిల్లాల్లో 1200 రోగాలను  కొత్త ఆరోగ్యశ్రీ జాబితాలోకి చేర్చి  పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు  జగన్ తెలిపారు.డెంగ్యూ తో సహా అన్ని,సీజనల్‌ వ్యాధులకు ఈ ఆరోగ్యశ్రీలో  చోటు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో తనికీలు మొదలుపెట్టి,ఫిబ్రవరి నెల ఆఖరునాటికి,తనిఖీలు పూర్తిచేసి,మార్చి 1 నుండి  ఆసుపత్రుల జాబితా  ఖరారు అవుతాయని,అధికారులు సీఎం జగన్ కు  తెలియచేసారు.ఈ ఆరోగ్యశ్రీ ఇక నవంబరు 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించనున్నట్టు అధికారులు సమావేశంలో వివరించారు.

డిసెంబరు 1 నుంచి శస్త్ర చికిత్సలు చేసుకున్న వారికి విశ్రాంతి సమయంలో  కూడా ఆర్ధిక సాయం లభించనుంది. ఆపరేషన్‌ చేయించుకున్న అనంతరం,విశ్రాంతి సమయంలో వాళ్ళకి ఆర్ధిక సహాయం,అందించేందుకు ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని,ఎటువంటి  పక్షపాతం లేకుండా అమలు చేయాలని, అలా అమలు చేస్తేనే ఆ పథకం విజయవంతమవుతుందని పేర్కొన్నారు. పథకాన్ని,అందరికీ వర్తింపజేయాలని  వారు ఆదేశించారు.ఆరోగ్యశ్రీ క్రింద ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఒక వ్యక్తి ధరఖాస్తు చేసుకున్నప్పుడు,ఏ ఆపరేషన్‌కు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమో వారే నిర్ణయిస్తారని చెప్పారు. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు లేదా రోజుకు రూ.225 ఇవ్వటానికి,ఇదివరకే  నిర్ణయం తీసుకునట్టే జివో  విడుదల చేయాలన్నారు.డాక్టర్లు ఇచ్చిన  సలహా మేరకు ఎన్ని రోజుల విశ్రాంతి అవసరమో,అన్ని రోజులు ఆ డబ్బులు వాళ్ళకి అందించాలన్నారు. డిసెంబరు 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. 

తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారికి నెలకు రూ.10 వేలు ఇచ్చి,ఈ పధకంలో  మరికొన్ని వ్యాధులను  చేర్చాలని జగన్ అధికారులకు వివరించారు.రూ.5వేలిచ్చే పెన్షన్‌   కేటగిరీలో తీవ్ర పక్షవాత చేత  వీల్‌ఛైర్‌కి పరిమితమయి ఉన్న వారికీ,రెండు కాళ్లు లేదా రెండు చేతులు లేనివారికి,లేక  అవి పనిచేయని పరిస్ధితుల్లో ఉన్నవారికి ఈ కేటగిరీ పెన్షన్‌ను వర్తిస్తుంది అని,వెంటనే ఈ మార్పులను చేసి,జనవరి 1 నుంచి అమలు చెయ్యాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి వివరాలు, వెంటనే విడుదల చేయాలని జగన్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: