సాధారణంగా పరీక్షలు రాసే సమయంలో పాపం విద్యార్థులకు ఓ టెన్షన్ ఉంటుంది.  ఎలాగైనా మంచిగా రాయాలి.. మంచి మార్కులు రావాలి అని టెన్షన్ పడుతూ పరీక్షలు రాస్తుంటారు.  కొందరైతే పాపం భయపడి పరీక్షలు సరిగా రాయలేరు.  కారణం ఏంటి అంటే.. ఎగ్జామ్స్ ఫోబియా.  దాని వలన తెలియకుండానే పరీక్షలు రాయలేక ఇబ్బందులు పడతారు.   


ఇక ఎగ్జామ్స్ హాల్ లోకి వెళ్లిన తరువాత స్టూడెంట్స్ పక్క చూపులు చూడకుండా, ఒకరి పేపర్ను మరొకరు కాపీ కొట్టకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పరిశీలకులు.  తలా తిప్పితే పనిష్ మెంట్ ఇస్తారు.  ఎందుకొచ్చిందిలే అని చెప్పి కామ్ గా కదలకుండా పరీక్షలు రాస్తుంటారు.  అలా పరీక్షలు రాస్తూ.. కొంతమంది పాసైతే.. కొంతమంది మాత్రం ఫెయిల్ అవుతుంటారు.  


పాస్ ఫెయిల్ అన్నది మన చేతుల్లో ఉండదు కదా మరి.  ఒక్కోసారి బాగా రాసినా ఫెయిల్ కావాల్సి వస్తుంది.  అయితే, కర్ణాటకలోని భగత్ ఫ్రీ యూనివర్శిటీలో జరిగిన పరీక్షల్లో స్టూడెంట్స్ మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఉండేందుకు ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు.  పరీక్షరాసే విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు తగిలించారు.  


మొహం వరకు మాత్రమే కనిపించే విధంగా అట్టపెట్టెను కట్ చేశారు.  పాపం అందరూ ఆ అట్టపెట్టెను తగిలించుకొని పరీక్షలు రాశారు.  ఎగ్జామ్స్  కు సంబంధించిన న్యూస్ ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ఆ దృశ్యాలను చూసి షాక్ అయ్యింది.  అదేంటి అంటే.. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు అని పరిశీలకులు చెప్పడం విశేషం.  


ఇలా తలలకు పెట్టెలు తగిలించుకొని పరీక్షలు రాయడం చాలా కష్టంగా ఉందని, కొత్తగా ఉందని పాపం స్టూడెంట్స్ అంటున్నారు. వాళ్ళను చూసుంటే.. తలకు డెస్క్ టాప్ లను అమర్చుకొని పరీక్ష రాసినట్టు అనిపిస్తోంది.  మొత్తానికి విద్యార్థులకు ఇదొక కొత్త అనుభవం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: