ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమి చేసినా ఒక పెద్ద సంచలనం అవుతుంది. గతంలో ఉద్యమాలతో తెలంగాణా  ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్  ఇప్పుడు ఉద్యమాలను ఎందుకు లైట్ తీసుకుంటున్నారు. ఒక వైపు ఉదయానే రాష్ట్ర బంద్ జరగనుంది అని తెలిసిన కూడా ఏమి  పట్టనట్లు పెళ్లి ఫంక్షన్ కు వెళ్లి వచ్చేంత లైట్ గా ఆయన ఉద్యామాన్ని తీసుకోవటం ప్రస్తుతం ఒక పెద్ద హాట్ టాపిక్ మారింది.


ఇవ్వని పక్కన పెడితే  నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. ఎక్కడికి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఇక నేడు  బంద్ ప్రభావం నిన్న సాయంత్రం నుండే మొదలు అయినట్లు కనిపంచాయి ప్రభావాలు.  శుక్రవారం జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్  కూడా చేయడం జరిగింది. ఇవ్వని ఇలా జరిగుతున్న కూడా కేసీఆర్  ఇంత టెన్షన్ లోనూ  నిన్న రాత్రి ఫంక్షన్ కి వెళ్లిరావడం జరిగిన విషయం చుస్తే  ఆశ్యర్యం వేస్తుంది. కానీ కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయం కెసిఆర్ ని నవ్వులపాలు చేసింది.


ఇంత హై టెన్షన్ వాతావరణంలో కూడా కెసిఆర్  అంత లైట్ గా తీసుకుని మాట్లాడిన  తీరుకు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారని సమాచారం వినిపిస్తుంది. ఇక శుక్రవారం జరిగిన  హై కోర్టు తెలంగాణా ప్రభుత్వానికి కార్మికులతో చర్చలు చేయాలనీ , సామరస్యపూర్వకంగా పరిష్కారం వెతకాలని రెండు సార్లు కూడా హెచ్చరించడం కూడా  జరిగింది , డెడ్ లైన్లు విధించినా కూడా సీఎం కేసీఆర్ మాత్రం అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 


ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం చర్చలు ఎందుకు జరపలేదు అని సమీక్షణ పై హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రగతిభవన్లో సమీక్ష కోసం ఉన్నతాధికారులకు ప్రగతి భవన్ నుంచి సమాచారం లభించింది . దాంతో వాళ్ళు నిన్న రాత్రి వారికి ఎడెనిమిది గంటల ప్రాంతంలో రావాలని ఆదేశాలు మేరకు  రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా తో పాటుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ కు వెళ్లడం జరిగింది.
కానీ సీఎం కేసీఆర్ మాత్రం తాజా రాజకీయ పరిణామాలు , తదితరుల  ఇబ్బందులతో ఏ మాత్రం సంబంధం లేనట్టు మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి రిసెన్షన్ కార్యక్రమానికి వెళ్ళారు అంటే నమ్మండి. ఏది ఏమైనా ఎప్పటికైనా  ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవటంతో  ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున  రగిలిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: