ఆన్ లైన్ లో ఇన్స్టాగ్రామ్ వ్యవహార శైలితో పోర్న్ స్టార్లతో పాటు, సెక్స్ వర్కర్లు ప్రస్తుతం బాగా ఆందోళన చెందుతున్నారు. తమపై ఎందుకంత వివక్ష అంటూ ఆ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌పై తమ ఆగ్రహం వెళ్ల గక్కుతున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఏమిటంటే వారి అకౌంట్లను ఇన్స్టాగ్రామ్ తొలగిస్తుండటమే. గైడ్‌లైన్స్, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వారి ఖాతాలను బ్లాక్ చేస్తోంది ఇన్స్టాగ్రామ్. దీనితో తమపై ఇన్స్టాగ్రామ్ కక్ష కట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా సైట్లలో సెక్స్ రిలేటెడ్ కంటెంట్ ఉంటే సెన్సార్ చేస్తారు. రెచ్చగొట్టే ఫోటోలు ఉన్నా, అభ్యంతరకర సన్నివేశాలను పోస్ట్ చేసినా వాటిని గుర్తించి బ్లాక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ టీం. 


అయితే, తమని మాత్రమే బ్లాక్ చేస్తున్నారంటూ పోర్న్ స్టార్లు గళమెత్తుతున్నారు. అదే సెలబ్రిటీలు ఎంత అభ్యంతరకర పోస్టులు పెట్టినా వారిని ఎందుకు బ్లాక్ చేయరంటూ ప్రశ్నిస్తున్నారు వారు ఇప్పుడు. ఈ వ్యవహారం పై ఇప్పటికే పోర్న్ స్టార్లు అంతా కలిసి ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సంస్థల ప్రతినిధులతో భేటీ కూడా అయ్యారు. తమ సమస్యను వారికి వివరించి అకౌంట్లు బ్లాక్ చేయకుండా ఆపుకోగలిగారు. 


అయితే తాజాగా జెస్సికా జేమ్స్ అనే పోర్న్ స్టార్ మృతి చెందడంతో ఆమె అకౌంట్‌ను ఇన్స్టాగ్రామ్ తొలగించింది. పలువురు నీలిచిత్రాల నటీనటులు దీంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ దాన్ని పునరుద్ధరించారు ఇన్స్టాగ్రామ్ టీం సభ్యులు. కానీ ప్రతీ సందర్భంలో ఇలాగే అవుతోందని, మరోసారి ఇలా కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అలనా ఇవాన్స్ అనే పోర్న్ స్టార్ గట్టిగా డిమాండ్ చేసింది.


తామూ ఈ సమస్య ఎదుర్కొన్నామని వందలాది మంది తనతో చెప్పారని ఆమె బహిరంగానే వెల్లడించింది. స్పాన్సర్‌షిప్ చేసే సందర్భంలో అకౌంట్‌ను తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని లీసా డేనియల్స్ ఇన్స్టాగ్రామ్ ని ఈ సందర్బంగా ప్రశ్నించింది. తీసుకున్న డబ్బులు సదరు కంపెనీకి తిరిగి చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది ఈ పోర్న్ స్టార్. న్యూడిటీ, సెక్సువల్ యాక్టివిటీ తదితరాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఈ మధ్యన నిషేదించారు. అయితే, తాము పూర్తిగా న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేయకున్నా అకౌంట్ డిలీట్ చేయడం ఏంటని ఆమె అడిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: