ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఏ.పీ.సెట్-2019' నిర్వహించేందుకు అన్ని సన్నాహాలు పూర్తయిపోయాయి. ఆంధ్రాలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అర్హత, పదోన్నతులకు వీలు కల్పించే 'ఏపీసెట్-2019' పరీక్షను ఈ నెల 20న నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పేపర్-1, తర్వాత 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-2 నిర్వహించడం జరుగుతుంది.

ఇక ఈ పరీక్ష కోసం ఆంధ్రా లోని గుంటూరు, నెల్లూరు, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం వంటి నగరాల్లో మొత్తం 60 పరీక్ష కేంద్రాలను ఏర్పరచి, ఆఫ్‌‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి గాను మొత్తం 34,020 మంది అభ్యర్థులు హాజరుకాగా., విశాఖ రీజియన్‌లో అత్యధికంగా 7,805 మంది ఏపీసెట్ పరీక్ష రాయనున్నట్టు సమాచారం.

ఏపీసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్ష హల్ లో ఎటువంటి అనుమతి లేదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరీక్షకు సంబంధించి 6 ముఖ్యంసాలు ఇపుడు చూద్దాం:
1) మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్షలుంటాయి.
2) దీనికోసం మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.
3) పేపర్-1లో 50 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-200 మార్కులు ఉంటాయి. అంటే ప్రతీ ప్రశ్నకు 2 మార్కులు చొప్పున పేపర్ ఉండబోతుంది.
4) పేపర్-1లో టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి, పేపర్-2లో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. అంటే మనం ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి.
5) అభ్యర్థులు OMR పత్రంలో వారి సమాధానాలను గుర్తించాలి.
పేపర్-1కు గంట, పేపర్-2కు 2 గంటల సమయం ఉంటుంది.
6) ఇక ఈ పరీక్షకు ఎటువంటి నెగెటివ్ మార్కులు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: