హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఒకవైపు కొనసాగుతుండగానే , మరొకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం, నివాసమైన ప్రగతిభవన్ ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం వెనుక పెద్ద వ్యూహామే ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . ప్రగతిభవన్ ముట్టడిలో ఏమాత్రం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న దాని ప్రభావం , ఉప ఎన్నిక పోలింగ్ పై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించి ఉంటుందని విశ్లేషిస్తున్నారు . ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోన్న నేపధ్యం లో ఇప్పటికే ఎంతోకొంత ప్రజా వ్యతిరేకతను అధికార పార్టీ మూటగట్టుకుంది.


 దాన్ని మరింత పీక్స్ తీసుకువెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు కన్పిస్తోందని అంటున్నారు . ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కి విన్నవించేందుకు  ప్రగతిభవన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తే , పోలీసుల ద్వారా అడ్డుకున్నారని ప్రజలకు చెప్పఁడానికి కాంగ్రెస్ నేతలకు రేపు ఈ కార్యక్రమం బలమైన ఆయుధంగా దోహదపడనుందని పేర్కొంటున్నారు . అదే సమయం లో ప్రగతిభవన్ వైపు దూసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడం ఖాయమని , వారిని  అడ్డుకునే క్రమం లో పోలీసులు కనుక లాఠీలకు పని చెబితే ఆ పార్టీ నాయకత్వ పథకరచన ఫలించినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


 హైకోర్టు సూచించిన    ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ఇప్పటికీ మొండికేస్తున్న అధికార పార్టీ  , హుజూర్ నగర్ ఉప ఎన్నికలో క్షేత్రస్థాయి లో ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నది నిర్వివాదాంశమేనని  అంటున్నారు. ఇక ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన తమపై లాఠీలను జులిపించిందని  ప్రచారం చేసుకోవడమే ద్వారా , ప్రజల సానుభూతి పొంది ఉప ఎన్నిక లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎత్తుగడ వేసినట్లు స్పష్టం అవుతోందని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: