తెలంగాణలో వైకాపా ఎక్కడా పోటీ చేయడం లేదు.  2014 ఎన్నికల్లో పోటీ చేసి ఖమ్మం జిల్లాలో సీట్లు సాధించినా..వాళ్ళు కూడా తెరాస పార్టీలో చేరిపోయారు.  దీంతో ఖమ్మంలో కూడా పార్టీకి బలం లేకుండా పోయింది.  ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వైకాపా జెండాలు కనిపించడం లేదు.  పార్టీ ఆఫీసుల్లో తప్పించి మరెక్కడా ఆ పార్టీకి సంబంధించిన జెండాలు లేవు.  కొంతమేర కార్యకర్తలు, నాయకులు ఉన్నా పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరగడం లేదు.  


ఫలితంగా తెలంగాణాలో వైకాపా సైలెంట్ గా ఉన్నది.  ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో జగన్ ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం సాధించారో అప్పటి నుంచి ప్రజల కోసం అనేక పధకాలు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.  ఒకటికాదు రెండు కాదు.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిడడం మొదలుపెట్టారు.  ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం అని చూడకుండా.. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు.  ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.  


అక్కడక్కడా కొన్ని తప్పులైతే జరిగుండొచ్చు.. కానీ, ఆ తప్పులను అడ్డం పెట్టుకొని అన్ని తప్పులే అంటే తప్పు కదా.  ఇది వేరే విషయం అనుకోండి.  జగన్ ప్రవేశపెడుతున్న పథకాలకు తెలంగాణాలోని చాలామంది, చాలా పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  జగన్ చెప్పినట్టుగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.  ఆటో వాళ్లకు పదివేల రూపాయల డబ్బు ఇచ్చారు.  ఇన్సూరెన్స్, ఫిట్నెస్ కోసం.  ఇవి కూడా బాగా ఆకట్టుకున్నాయి.  రైతు భరోసా కిందా రూ. ప్రతి రైతుకు 13, 500/- ఇచ్చారు.  


ఇప్పుడు, జగన్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో సైతం హీరో అయ్యారు. జగన్ తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటున్నారు.  జగన్ ఇటీవలే హైదరాబాద్ లో జరుగుతున్న కొన్ని వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చారు.  జగన్ వచ్చారని తెలుసుకున్న అభిమానులు చాలామంది ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో వాళ్ళను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది.  చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తెలంగాణలో పోటీ చేసేలానే కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: