దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడానికి కారణం సరైన సమయంలో హాస్పిటల్స్ కు చేరుకోలేకపోవడమే.  సరైన సమయంలో హాస్పిటల్ కు చేరుకుంటే..అసలు ఆ బాధలు ఉండవు.  సమయానికి హాస్పిటల్స్ కు చేరుకుంటే.. కొంతమేర బ్రతికే అవకాశాలు ఉంటాయి.  దేశంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం హైవైలపైనే జరుగుతున్నాయి.  హైవైలలో వాహనాలు ప్రయాణం చేసే సమయంలో అత్యధిక స్పీడ్ తో వాహనాలు ప్రయాణం చేస్తుండంటం..పరిమితికి మించి వేగంతో ప్రయాణం చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.  


దీనిపై వైకాపా దృష్టి పెట్టింది.  ప్రమాదాలను అరికట్టేందుకు సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో 4,500 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి.  ప్రతి 50 కిలోమీటర్ కు ఒక హెచ్ఈసి ఏర్పాటు చేయాలని  నిర్ణయించింది.  4500 కోలోమీటర్ల పరిధిలో మొత్తం 90 హెచ్ఈసిలను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ హెచ్ఈసి లలో శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.  క్లినిక్ నిర్వహణకు రూ. 80 లక్షల వరకు ఖర్చు అవుతుంది.  అంటే మొత్తం 90 క్లినిక్ లకు దాదాపుగా రూ. 72 కోట్లు ఖర్చు అవుతుంది.  


ఇక ఈ 50 కిలోమీటర్లలో ఉన్న ఈ క్లినిక్ లను రాష్ట్రంలోని 108 సర్వీస్ లకు అనుసంధానిస్తారు.  ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగిన మొదట పారామెడికల్ క్లినిక్ లో అత్యవసర చికిత్స అందించి అక్కడి నుంచి హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  క్షతగాత్రుల కోసం గతంలో రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ రాష్ట్రవ్యాప్తంగా 32 ట్రామాకేర్‌ ఆస్పత్రులు గుర్తించింది. వీటిలో 19 ప్రభుత్వాస్పత్రులు కాగా, 13 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు


దీంతో ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది.  సుప్రీం కోర్టు కమిటీ సూచనల మేరకు హైవే రహదారులపై ఈ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నది.  ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. చాలావరకు ప్రమాదాల బారినుంచి బయటపడొచ్చు.  గోల్డెన్ అవర్ లోనే ప్రమాదం జరిగిన వ్యక్తులను హాస్పిటల్స్ కు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఈ కొత్త పధకానికి వైఎస్ఆర్ ఎమర్జెన్సీ అని పేరు పెట్టింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: