తెలంగాణ ఎన్నికల తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక కావడం వల్ల హుజూర్‌నగర్ పై అందరికీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల  నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం  5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 28  అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పార్టీ విజయం కోసం అహర్నిశలు  ప్రయత్నం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా ఈ విజయంతో ప్రజలతో ఇంకా మంచి  పేరు సాధించాలన్న ఉద్దేశంతో చాలా పట్టుదలతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

అలాగే కాంగ్రెస్ కూడా తమ సెట్టింగ్స్ అని వదులుకోవడానికి ఏమాత్రము ఆసక్తి చూపించడం లేదు. బీజేపీ  కూడా ఎలాగైనా గెలిచి 2024 కి టిఆర్ఎస్ కి ప్రయత్నమమ్ కావాలనే సి ప్రయత్నం చేస్తుంది.పోలింగ్ అధికారులు 302 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 1500 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. విజేత ఎవరో ఈ నెల 24న తేలనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నిక జరుగుతున్న ఒకే ఒక నియోజకవర్గం కావడంతో.. అందరి చూపు హుజూర్‌నగర్‌పై పడింది. 


ఈ నియోజకవర్గంలో హుజూర్‌నగర్ సహా ఏడు మండలాలు ఉన్నాయి. మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. కాగా మహిళా ఓటర్లే ఎక్కువ కావడం గమనార్హం. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య 1,20,427 కాగా.. పురుష ఓటర్ల సంఖ్య 1,16,415.ముదిరాజ్, పెరిక, వైశ్యులు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.


హుజూర్‌నగర్ ఉత్తమ్ కుటుంబానికి కంచుకోట కావడం, కాంగ్రెస్ తన బలాన్ని మొత్తం మోహరిస్తుండటం, కారు గుర్తును పోలి ఉన్న గుర్తులు టీఆర్ఎస్‌కు ప్రతికూలం. కానీ గత ఎన్నికలో కొద్దిలో ఓడామన్న భావనలో ఉన్న టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో తన బలం మొత్తాన్ని ఉపయోగిస్తోంది. ఓటర్లపైకి అభివృద్ధి మంత్రాన్ని ప్రయోగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: