గత సంవత్సరంతో పోలిస్తే  ఈ సంవత్సరం  అక్టోబర్‌ రెండో వారం నుంచే కూరగాయల ధరలు బాగా దగ్గయి అని తెలుస్తుంది. ఇక ఆన్‌ సీజన్‌ ఐనా ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ నెలలో కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయి. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్‌ చివరివారం నుంచే నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు రోజు రోజుకు భారీగా పెరుతున్నాయి. దిగుమతులు పెరిగిపోవడంతో  దాదాపు అన్ని కూరగాయల ధరలు రూ.40 లోపే లభిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా తగ్గుతాయని మార్కెట్‌ అధికారులు తెలియ చేస్తున్నారు. 


నిజానికి  ఆన్‌ సీజన్‌లో నగర మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి జరుగుతాయి అని అందరికి తెలిసిందే. అన్‌ సీజన్‌లో నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చిడానికి కమిషన్‌ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌ల నుంచి ఎక్కువ శాతంలో నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్‌బీనగర్‌తో పాటు ఇతర మార్కెట్‌కు రోజుకు 70 నుంచి 80 శాతం అన్ని రకాల  కూరగాయలు దిగుమతి అవ్వడం జరిగింది. 


 ప్రస్తుతం మాత్రం  నగర శివారుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయల దిగుమతులు జరగడంతో ధరలు బాగా తగ్గుముఖం పడ్డాయి అని తెలుస్తుంది. ఇక  అక్టోబర్‌ నెల ప్రారంభం నుంచే కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి.  అన్ని రకాల కూరగాయలు దిగుమతి అవ్వడం దీనికి ముఖ్య కారణం.  గతంలో మాత్రం శివారు ప్రాంతాల నుంచి రోజూ కూరగాయల దిగుమతులు ఉండేవి కావు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లకు రాని కూరగాయలను కమిషన్‌ ఏజెంట్లు నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండేది.


ఇక తెలంగాణ రాష్ట్రము  వ్యాప్తంగా నీటి లభ్యత బాగా ఉండడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు పండించడం జరుగుతుంది. ఇక రంగారెడ్డి, వికారాబాద్, మెదక్‌ జిల్లాల రైతులు ఈ సంవత్సరం జూలై నుంచే కూరగాయలను సాగు చేయడం మొదలుపెట్టారు. దీంతో సెప్టెంబర్‌ చివరి నుంచే పంట చేతి కొచ్చే అవకాశలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో  ఇంకా కూరగాయలు  ధరలు  తగ్గుతాయి అని  అధికారులు తెలియచేస్తునారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: