అభిజిత్ బెనర్జీ.. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత. పేదరిక నిర్మూలనకు విశిష్ఠ పరిశోధనలు జరిపిన అభిజిత్‌కు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అభిజిత్‌తోపాటు ఆయన భార్య డ్యుఫ్లో, మైఖెల్‌ క్రేమర్‌ కూడా నోబెల్‌కు ఎంపికయ్యారు. 2014 ఎన్నికల సమయంలో అభిజతి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి న్యాయ్‌ పథకాన్ని సూచించారు. పేదరికాన్ని పారద్రోలే ప్రతిపాదనలు చేసిన ఆర్థిక వేత్తగా అభిజిత్ కు పేరుంది.


అభిజిత్ బెనర్జీ.. ఈ సందర్భంగా భారత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనకు స్నేహితురాలని ఆయన కామెంట్ చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో తాము కలిసి చదువుకున్నామని అభిజిత్‌ బెనర్జీ తెలిపారు. 1983లో అభిజిత్‌ జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తిచేయగా, నిర్మలాసీతారామన్‌ కూడా ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌తోపాటు 1984లో ఎంఫిల్‌ పూర్తిచేశారు.


దేశం గురించి జేఎన్‌యూలో తాను ఎంతో నేర్చుకున్నానని అభిజిత్‌ అంటున్నారు. నిర్మల తనకు స్నేహితురాలని, ఆమె చాలా తెలివైనవారని ఆయన ప్రసంసించారు. అప్పట్లో తమ రాజకీయ భావనలు కూడా నాటకీయంగా భిన్నంగా ఉండేవి కాదన్నారు. 2014 ఎన్నికల సమయంలో అభిజతి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి న్యాయ్‌ పథకాన్ని సూచించారు.. దీనిపై ఆయన స్పందిస్తూ.. న్యాయ్‌ పథకాన్ని వాస్తవానికి సరిగా రూపొందించలేదన్నారు. దాన్ని ఎలా రూపొందించాలి అని నన్ను ఎవరూ అడుగలేదు. కాబట్టి దానికి నాది బాధ్యత కాదని అభిజిత్ కామెంట్ చేశారు.


న్యాయ్‌ ఒక ఐడియా. దానికి రాజకీయంగా మద్దతు లభించినా.. అది మంచిగా రూపొందించిన పథకం కాకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉన్నా.. రాజకీయ ఒత్తిళ్లు.. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా వారు అందులో మార్పులు చేయాల్సి వచ్చేది. పథకం రూపొందించడం నా పాత్ర కాదు. నిర్ణయాలు తీసుకునేందుకు సమాచారం ఇవ్వడమే నా పని అంటూ అభిజిత్ స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: