హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి.  ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ పార్టీల మధ్య పోటీ ఉన్నది.  అయితే, ఈసారి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్తున్నా.. ఎంతమేరకు పోటీ ఉంటుంది.. మిగతా పార్టీలు ఏ మేరకు పోటీ ఇవ్వబోతున్నాయి అన్నది తెలియాల్సి ఉన్నది.  పోటీ విషయంలో అన్ని పార్టీలు గెలుపు తమదే అంటే తమదే అని అంటున్నాయి.  


ఓటరు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారు అన్నది ఈనెల 24 వ తేదీన తేలిపోతుంది.  24 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.  మధ్యాహ్నం వరకు కౌంటింగ్ లెక్కింపు చాల వరకు పూర్తవుతుంది.  మధ్యాహ్నం ఎవరు గెలుస్తారు అన్నది తేలిపోతుంది.  ఇక ఇదిలా ఉంటె, ఈ ఎన్నికల్లో అనేక సిత్రాలు జరుగుతున్నాయి.  నేతలు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధరకాల వాహనాల్లో వస్తున్నారు.  ఓటర్లకు తాము దగ్గరవారం అని చెప్పేందుకు ఇలా చేస్తున్నారు.  అందులో సందేహం అవసరం లేదు.  


ఆకట్టుకోవడానికి నాయకులు ఎన్ని సిత్రాలైన చేస్తారు.  సిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.. కాగా, ఎన్నికల్లో ఓటు వేయడానికి హర్యానా ముఖ్యమంత్రి శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసి సొంత సొంత ప్రాంతానికి చేరుకున్నారు.  అక్కడి నుంచి పోలింగ్ బూత్ వరకు సైకిల్ మీద వెళ్లి ఓటు వేసి వచ్చారు.  ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఓటు వేయడానికి సైకిల్ మీద వచ్చారు అని తెలియగానే అక్కడి జనాలంతా ఒక్కరిసారిగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు.  ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సైకిల్ మీద వచ్చినా అయన ప్రొటెక్షన్ ఆయనకు ఉంటుంది.  ఆ ప్రొటెక్షన్ దాటి బయటకు రాలేరు.  


ఇకపోతే, హర్యానాకు చెందిన మరో పార్టీ జేజేపీ అధినేత దుశ్యంత్‌ చౌటాలా ట్రాక్టర్ మీద వచ్చారు.  ట్రాక్టర్ మీద తన కుటుంబంతో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తరువాత ప్రభుత్వాన్ని స్థాపించబోయేది జేజేపీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే తాము తమ గుర్తు అయిన ట్రాక్టర్ తో పోలింగ్ బూత్‌కు చేరుకున్నట్టు అయన తెలిపారు.  మొత్తానికి ఓటర్లను ఆకట్టుకోవడానికి నాయకులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: