శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే ....  సెయింట్ స్టీఫెన్ కాలేజీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు.ఘటన జరిగిన మరో అరగంటకు ప్రొఫెసర్ తల్లి ఢిల్లీ పీతంపురాలోని తమ నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది.మృతురాలి భర్త గతేడాది డిసెంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఇక దీనిపై వారు మనోవేదనకు గురై ఉంటారని అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు.


ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు మరో విషయాన్ని బయటపెట్టారు. స్టీఫెన్స్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ముందుగా తన తల్లిని హత్యచేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.తల్లి మృతి చెందిన గదిలో రెండు కత్తులతో పాటు మలయాళంలో రాసి ఉన్న సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతుడికి సంబంధించిన వివరాలను కనుగొన్నట్లు డీసీపీ గుప్తా తెలిపారు.

వెంటనే అతని మొబైల్ నుంచి తన సహోద్యోగికి ఫోన్ చేయగా ప్రొఫెసర్ వివరాలు తెలిశాయని వెల్లడించారు.తమ స్నేహితులు తెలిసినవారు ఇద్దరికీ ఫోన్ చేస్తున్నా ఎవరూ సమాధానం ఇవ్వకపోవడం, ఇద్దరూ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక తలుపు తీయకపోవడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సాగర్ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీని అలర్ట్ చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము కేరళలో క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాసి ఉందని సాగర్ చెప్పాడు.                                                                      



మరింత సమాచారం తెలుసుకోండి: