తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కష్టాలు తప్పటం  లేదు. తిరుపతి ప్యాసింజర్‌ రైలును కదిరిదేవరపల్లి వరకు పొడిగించడం వల్లే ఈ సమస్య మరింత తీవ్రమైంది అంటున్నారు భక్తులంతా.కదిరిదేవరపల్లి – తిరుపతి – కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌ రైలు అత్యంత చౌక ధరతో  ఉండటం వల్ల తిరుపతి వెళ్లేవారికి ఇది ఎంతో అనుకూలం. దీంతో ఈ రైలు ప్రయాణం పట్ల వెంకన్న భక్తులు ఎక్కువ మక్కువ చూపుతుంటారు.

ఈ ప్యాసింజర్‌ రైలు గుంతకల్లు జంక్షన్‌కు సాయంత్రం 5.45 వచ్చి 6.00 గంటలకు వెళ్లాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో  ఎప్పుడు ఈ రైలు, ఏ రోజూ కూడా సరైన సమయానికి రాలేదు అని జనాలు వాపోతున్నారు. గుంతకల్లు జంక్షన్‌కు సాయంత్రం 7.00లకు పైగా చేరుకుంటుంది. దీంతో నిత్యం వందల మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులతో పాటు  విధులు ముగించుకొని అనంతపురం వెళ్లే రైల్వే ఉద్యోగులు కూడా ఈ రైలు సమయానికి రాకపోవడంతో పడిగాపులు కాస్తూ,తీవ్ర ఇబంధులు ఎదురుకొంటున్నారు  ప్రయాణికులు,వెంకన్న భక్తులు.

దీనివల్ల నిత్యం వందలాది మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులు,విధులు ముగించుకొని అనంతపు రం వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ప్రతి రోజూ ఆలస్యంగా ఇళ్లకు చేరుకుంటున్నామని రైల్వే ఉద్యోగులు వాపోతున్నారు.ఇతర  ప్రయాణికులు కూడా  ప్రతి రోజూ ఆలస్యంగా ఇళ్లకు చేరుకుంటున్నామని రైల్వే ఉద్యోగులు కూడా వాపోతున్నారు. ఇక ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణించడానికి ప్రయాణికులు అంతగా ఆసక్తి చూపటం లేదు.

రైల్వే అధికారులు కూడా ప్యాసింజర్‌ రైళ్ల పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల ఈ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ప్యాసింజర్‌ రైలులో ప్రయాణించి ఆలస్యంగా గమ్యానికి చేరుతుంటే,ఇక ప్రత్యామ్నయంగా బస్సు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు అని చెప్తున్నారు. ఆలస్యంగా ఇంటికి చేరుతున్న కారణం చేత,ప్రయాణమంటేనే బేజారుగా మారింది అంటున్న ప్రయాణికులు,ఉద్యోగులు.


మరింత సమాచారం తెలుసుకోండి: