హైదరాబాద్ దాదాపు 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నగరం.  ఇప్పుడు హైదరాబాద్ కు గ్లోబల్ సిటీగా పేరు ఉన్నది.  ప్రపంచంలోని గొప్ప గొప్ప సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి.  హైదరాబాద్ ఇప్పుడు బిజినెస్ హబ్ గా మారింది.  బిజినెస్ రంగంలో దూసుకుపోయేందుకు సిద్ధం అవుతున్నది.  ఒక్క బిజినెస్ పరంగానే కాకుండా అన్ని రకాలుగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది.  భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సాధిస్తుంది.  


ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన నగరంలో రోడ్ల దుస్థితి చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది.  కాసేపు వర్షం కురిస్తే చాలు.. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు చేరుతుంది.  చెరువులను తలపించే విధంగా నీరు రోడ్లపై చేరుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది.  వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. వర్షం తగ్గి.. నీరు వెళ్లిపోయిన తరువాత చూస్తే రోడ్లపై గుంతలు కనిపిస్తాయి.  గ్లోబల్ సిటీలో ఇలాంటి దృష్ట్యాలు కనిపించడం అంటే ఇబ్బందికరమైన అంశం అని చెప్పాలి.  


గ్లోబల్ సిటీలో గతుకుల రోడ్లు అంటే ఇబ్బందికరమైన అంశం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్ల పరిస్థితి దారుణంగా మారిపోవడంతో తెరాస ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.  దీంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.  నగరంలోని 709 కిలోమీటర్ల రహదారికి మరమ్మత్తులు చేయాలని నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం కింద టెండర్లను పిలుస్తున్నారు.  ప్రస్తుతం రోడ్ల గుంతలు పూడ్చివేత, కొత్త రోడ్లు, లేయర్ల వంటి వాటికి వేర్వేరు టెండర్లు పిలుస్తారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు తవ్వాలంటే కనీసం ఆరు నెలల ముందే సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటుంటున్న ప్రభుత్వం పేర్కొన్నది.  రోడ్ల తవ్వకాలు, ఆ వెంటనే పూడ్చే బాధ్యత పూర్తిగా వర్కింగ్ ఏజెన్సీలకే అప్పగిస్తున్నారట.  


వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చుకుంటూ వెళ్తే కొంతరకు మంచిదే అని చెప్పాలి.  ఎందుకంటే, కొత్తగా రోడ్లు వేయాలి అంటే ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  పైగా ఎక్కువ సమయం పడుతుంది.  అలా కాకుండా ఇలా రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడానికి పెద్దగా సమయం పట్టదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: