రాష్ట్రానికే తలమానికంగా నిలిచే పోలవరం ప్రాజెక్టును పారదర్శకంగా నిర్మించాలనుకుంటున్న ఎపి సర్కార్  ఫై అజమాయిషీ చేసేందుకు కేంద్రం సమర్ధమవుతుంది. హస్తినలోకి పరిస్థితులను పరిశీలిస్తే అవుననే అనిపిస్తుంది. ప్రాజెక్టు పనులను ఎప్పుడు ప్రారంభించబోతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 అక్టోబరు నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారన్న విషయాన్ని సమావేశంలో గుర్తు చేశారు. పనులు ఆలస్యమైతే గడువులోపు ప్రాజెక్ట్ పూర్తి చేయగలరా అంటూ పీపీఏ అధికారులు ప్రశ్నించారు. పనులు ఆలస్యమైతే ఆర్థిక భారం కూడా పడుతుందని ప్రస్తావించగా.. రివర్స్ టెండరింగ్‌త రూ.786కోట్లు ఆదా చేసినట్లు ఏపీ అధికారులు వివరించారు. కొత్త కాంట్రాక్టర్ ఒప్పందం ఎప్పుడు కుదురుతుందని.. నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలపై ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యల ఎలా ఉండబోతున్నాయని అడిగినట్టు తెలుస్తుంది.


ఇక ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి కొత్త కాంట్రాక్ట్ సంస్థ మెషిన్లు, ఇతర పరికరాలనున సమకూర్చోగలరా అంటూ ప్రశ్నించగా.. కొత్త సంస్థ సమర్థత ఉన్నదేనని ఏపీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర జలశక్తిశాఖ నియమించే అధికారిని దర్యాప్తు బృందంలో సభ్యుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరంకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేస్తోన్న విజిలెన్స్‌ దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేంద్ర జలవనరులశాఖ నియమించే ప్రతినిధి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తు బృందంలో ఉంటారని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఏపీ అధికారులు రివర్స్ టెండరింగ్‌కు సంబంధించి ఓ నివేదికను పీపీఏకు అందజేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని.. ప్రధాన డ్యాం పనుల్లో సెక్షన్ల వారీగా పనులు ఏ ప్రాధాన్యంలో పూర్తి చేస్తారో నివేదిక ఇవ్వాలని పీపీఏ కోరింది. దీనికి సంబంధించి అవసరమైతే ఒకరికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించాలని సూచించింది.




కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు జరిపి ఆకృతుల ఆమోదం పూర్తి చేయాలని వివరించింది.  2020 మే నాటికి కాఫర్‌ డ్యాంలో మిగిలిన పనులు పూర్తిచేయాలని.. 41.15 మీటర్ల ఎత్తుకు అవసరమైన మేర పునరావాస కార్యక్రమాలను 2020 మే నాటికి పూర్తిచేయాలని సూచించింది. రాష్ట్రం ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.5,034 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ నిధుల్ని కేంద్రం విడుదల చేయాలని పీపీఏకు ఏపీ అధికారులు విన్నవించారు. కొత్త కాంట్రాక్టర్‌కు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బందులు ఉన్నాయని.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని.. స్టే ఎత్తివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయని ఏపీ అధికారులు తెలిపారు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పీపీఏ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఏపీ జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: