తమిళనాడు రాష్ట్రంలో ఒక బిల్డర్ ఇచ్చిన ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. ఒక బిల్డర్ తమిళనాడు రాష్ట్రంలోని పత్రికల్లో ఫ్లాట్స్ ఫర్ సేల్ కానీ బ్రాహ్మణులకు మాత్రమే అని ప్రకటన ఇచ్చాడు. ఓం శక్తి కన్‌స్ట్రక్షన్ అనే సంస్థ తిరుచ్చి నగరంలోని శ్రీరంగం ప్రాంతంలోని మేలూరు రోడ్డులో శ్రీ శక్తి రంగ అపార్టుమెంట్ ను నిర్మించింది. అపార్టుమెంట్ నిర్మాణం పూర్తి కావటంతో అపార్టుమెంట్ లోని ఫ్లాట్స్ అమ్మటం కొరకు పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. 
 
ఈ ప్రకటన తమిళనాడు రాష్ట్రం అంతటా వైరల్ అయింది. తమిళనాడు రాష్ట్ర అసృశ్యతా నివారణ ఫ్రంట్ ఈ ప్రకటన అంటరానితనానికి నిదర్శనమని పేర్కొంది. ఈ ప్రకటన ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుచ్చి జిల్లా కలెక్టర్ శివరాసుకు తమిళనాడు రాష్ట్ర అసృశ్యతా నివారణ ఫ్రంట్ ఫిర్యాదు చేసింది. తమిళనాడు అసృశ్యతా నివారణ ఫ్రంట్ జిల్లా కార్యదర్శి వినోద్ ఈ అంశంపై మాట్లాడుతూ ఈ ప్రకటన గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 
 
బ్రాహ్మణులకు మాత్రమే ఫ్లాట్లను విక్రయిస్తామంటూ చేసిన ప్రకటన ముస్లింలకు, దళితులకు ఫ్లాట్లు ఇవ్వకుండా నిరోధించాటానికే అని వినోద్ అన్నారు. బిల్డర్ ఇచ్చిన ప్రకటన తప్పని వినోద్ పేర్కొన్నారు. కులమతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మిస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటన ఏమిటని వినోద్ అన్నారు. తిరుచ్చి చీఫ్ ఇంజనీర్ ను వినోద్ ఇలా ఒక కులం కొరకు నిర్మించిన అపార్టుమెంట్ కు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించాడు. 
 
వినోద్ బిల్డర్ పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద శ్రీరంగం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రకటనపై విమర్శలు రావటంతో ఓంశక్తి కన్‌స్ట్రక్షన్ ఎండీ జీఎం అంబూ ఈ ప్రకటనపై స్పందించారు. ఫ్లాట్లను బ్రాహ్మణులకు మాత్రమే విక్రయిస్తామని ప్రకటనలో తప్పుగా పడిందని ఫ్లాటను శాకాహారం తినేవారు ఎవరికైనా విక్రయిస్తామని అంబూ తెలిపారు. శాకాహారం తినేవారు ఎవరికైనా కులాల పట్టింపు అనేది లేకుండా విక్రయిస్తామని ఆంబూ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: