"తెలంగాణ ప్ర‌జ‌లు నిరుపేదరికాన్నైనా భరించగలరేమో గాని దొర‌త‌నాన్ని, నియంతృత్వాన్ని, అణచివేతలను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీకరించరు - ఇప్పుడు కేసీఆర్ కూడా నియంతృత్వ ధోర‌ణి తో వ్యవహరిస్తున్నారనే భావ‌ప్ర‌జ‌ల్లో క్రమంగా బలపడుతుంది"  ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంట న‌డించింది. స‌క‌ల జ‌నులూ ఉద్యమానికి జేజేలు ప‌లికారు. ఇప్పుడు అదే తెలంగాణ స‌మాజం మొత్తం కేసీఆర్‌కు క్రమంగా వ్య‌తిరేక‌ మ‌వుతోంది. ఊద్యోగ వర్గాలతో సహా స‌క‌ల జ‌నులు శాప‌నార్థాలు పెడుతున్నారు. ఆయ‌న ఫ్లెక్సీలు, ఫొటోలు ఎక్కడికక్కడ ద‌హ‌నం చేస్తున్నారు.


కేసీఆర్ పై ప్రజల్లో రగులుతున్న వ్యతిరేఖతకు కారణాలు


*ఆర్టీసిని ఏభై శాతం ప్రైవేటీకరిస్తాం

*ఏభై వేల మంది ఆర్టీసి ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లే అని సెల్ఫ్ గోల్

*సెప్టెంబర్‌ నెలలో పనిచేసిన కాలానికి ఆర్టీసి కార్మికులకు జీతం ఇవ్వకుండా ఆపడం

*సమ్మెలో ఉన్న ఆర్టీసి కార్మికులకు తార్నాక ఆస్పత్రిలో చికిత్సలు నిలిపివేయడం అమానుషం

*ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గోనని మంత్రుల బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు


*ఆర్టీసి కార్మికులకు కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని అన్న కేసీఆర్‌, కేవలం పండగ అడ్వాన్స్‌ కోసం గతంలో ఆర్టీసి కార్మికుల తరపున దర్నాలు చేసిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు తనకు సహకరించిన ఆర్టీసి కార్మికులతో గొడవ పెట్టుకోవడం, అసలు సంఘాలే ఉండరాదని అనే పరిస్థితికి వెళ్లడం చారిత్రక విషాదమే

*ఉమ్మడి ఏపి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తే, విభజిత ఏపీ కొత్త ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించగా, గతంలో కేసీఆర్‌ ఇదే హామీ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో అనేదానిపై తను వివరణ ఇవ్వాలి. 

*రెండవ సారి అధికారంలోకి వచ్చాక మూణ్ణెల్లకి పైగా మంత్రిమండలి లేకుండా ఈ ప్రజారాజ్యాన్ని నడిపించిన ఏకైక భారతీయ నియంత ఈయనగా చెప్పవచ్చు.

*పాలన సచివాలయం నుండి కాకుండా తన అధికార నివాసం ప్రగతి భవన్ నుండి జరపటం ప్రజలంటే ప్రజా పాలనా వేదికలంటే ఎంత అలక్ష్యమో తెలుస్తుంది.

*స్వాతంత్ర్యం లేని మంత్రులు మంత్రి మండలి నిరంకుశత్వానికి పరాకాస్ఠ.


*అధికారుల తప్పిదాలకో ప్రభుత్వంలోని స్వార్ధపరుల అక్రమాలకో బలై ఇరవై మంది ఇంటర్మీడియట్ విద్యార్దుల ఆత్మ హత్యలు కూడా చలించని కఠిన వైఖరి.

*50000 మంది టిఎస్ ఆర్టీసి కార్మికులను “సెల్ఫ్ డిస్మిస్” అంటూ ఉద్యోగాల్లోంచి తొలగించటం తననెదిరించినవారిపై ఆయనలోని అసహనానికి పరాకాష్ట.

*35 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినవారితో చర్చలు జరపక పోవటం అత్యంత అప్రజాస్వామికం. 


కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ ర‌థ సార‌థి. స‌క‌ల జ‌నులూ ఆయ‌న వెంట నిలిచారు. ఆయ‌న మాట‌ను తీసేయ‌లేదు. సాధారణంగా ఉద్యమ పార్టీలు స్వ‌రాష్ట్రం సిద్ధించిన త‌ర్వాత అధికారం కోసం ప్రాకులాడ కుండా ఉండటం ఉత్తమం. కాని ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరవాత ఆయ‌న‌కే అధికారం క‌ట్ట‌బెట్టారు.


ఐదేళ్ళ పాలన తరవాత రెండోసారి కూడా ఆయ‌న‌కే పాల‌నాప‌గ్గాలు అప్ప‌గించారు. కానీ ఈ ఆరేళ్ల‌లోనే అనూహ్య ప‌రిణామాలు చోటుచేసు కున్నాయి. కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరిగింది.


చాలాకాలంగా ప్ర‌తిప‌క్షాల స్వరం కూడా ఇదే - ఇదే ఆరోప‌ణ చేస్తున్నాయి. కేసీఆర్ నియంత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నాయి. తాజాగా, జ‌రుగుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో ఇదే విష‌యం ఋజువైందని చెబుతున్నాయి.


నిజానికి టీఆర్ఎస్‌ పార్టీలో, ప్ర‌భుత్వంలో కేసీఆర్ మాటే సుగ్రీవాఙ్జ. ఆయన మాటే శాసనం ఆయన చెప్పిందే వేదం.  “నాం’ కే వాస్తే” మంత్రులు. వారి స్వతంత్ర నిర్ణ‌యాలకు అవకాశమే లేదని క‌నీసం అభిప్రాయం వెబుచ్చే ఆస్కారం ఉండదని ప‌లువురు మంత్రులు త‌మ మిత్రుల  వ‌ద్ద వేదన వెలిబుచ్చుకుంటున్నారట. దీంతో అధికార పార్టీలోను తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.


సుమారు 50 వేల మంది కార్మికుల‌ను “సెల్ఫ్ డిస్మిస్” - అంటూ ఒక్క నోటిమాటతో తొలగించటం లోని ఆంతర్యమేమిటి? నైతికతకు స్థానమేది? ఆందుకు ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకోవ‌డానికేనా! స్వ‌రాష్ట్రం సాధించుకున్న‌ది! అంటూ ఉద్యోగుల ఆగ్ర‌హనికి తమగొంతు కలుపుతున్నారు ప్రజలు.  ‘ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే త‌ట్టుకోలేరు’ అంటూ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.


ఆర్టీసీ కార్మికుల త‌ల‌పెట్టిన తెలంగాణ బంద్ విద్యార్థులు, ఉద్యోగులు, విప‌క్షాలు, విద్యావంతులు, న్యాయ‌వాదులు.. ఇలా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మద్ద‌తు ఇస్తున్నారు.


ఆరేళ్ళలో ఎంత మార్పు నాడు కేసీఆర్ తెలంగాణాలో అందరివాడు – నేడు ఎవరికి చెందని ఒంట‌రి వాడు అవుతున్నారు. ఆయ‌న వెంట న‌డిచే వారు దాదాపు క‌రువ‌య్యార‌నే వాదన బ‌లంగా వినిపిస్తోంది.


ఇక సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజెన్స్ కేసీఆర్‌పై యుద్ధ‌మే చేస్తున్నారు. దీంతో మొట్ట‌మొద‌టి సారి కేసీఆర్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయార‌ని, ఇక ఆయ‌న రాజ‌కీయ జీవితం క్షీణిస్తూ చివ‌రిద‌శ‌కు చేరుకోవటం ప్రారంభ‌మైంద‌నే మాట తెలంగాణ‌ అంతటా బ‌లంగా వినిపిస్తోంది. ఒకవేళ హుజూర్ నగర్ పార్లమెంటరీ స్థానంలో టీఅరెస్ గెలిచినా అది నామ మాత్రమే నని అంటున్నారు విశ్లేషకులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: