పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య పాడివోటంతో ఆయనను  వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. డెంగ్యూ జ్వరం సోకిందని మొదట భావించినప్పటికీ, రక్త పరీక్షల్లో డెంగ్యూ జ్వరం లేనట్లు నిద్దారం అయింది.. నవాజ్ షరీఫ్ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ స్పందించారు. నవాజ్ షరీఫ్ ప్లేట్‌లెట్ కౌంట్ భారీగా పడిపోయిందని అయితే దీనికి కారణం గతంలోని అనారోగ్య కారణాల వల్లనే  ప్రస్తుతం ఈ సమస్య తలెత్తిందని ఆయన మీడియా కి తెలిపారు.

లాహోర్‌‌లోని ప్రముఖ ఆసుపత్రిలో నవాజ్ షరీఫ్‌ చికిత్స పొందుతున్నారు.ప్రత్యేక వైద్యుల బృందం  మొత్తం ఆయనను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం షరీఫ్ ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నవాజ్ షరీఫ్ ఓ అవినీతి కేసులో పోలీసు కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై విడుదలై వచ్చారు.పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమం గా ఉండటంతో వాళ్ళ  పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.

 ఆయన ప్లేట్‌లెట్లు ప్రమాదకరస్థాయికి పడిపోవడంతో వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు జైలు అధికారులు ఆయనను లాహోర్‌లోని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కార్యాలయం నుంచి నేరుగా లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఆసుపత్రిని సందర్శించి నవాజ్‌ను పరామర్శించారు.

కాగా, అధికారులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు  కూడా ఏర్పాటు చేశారు. ఆయన చికిత్స పొందుతున్న గదిని  సబ్‌జైలుగా ప్రకటించిన అధికారులు నవాజ్‌ను ఎవరూ కలవకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది. పనామా పత్రాల కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ కోర్టులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: