ఇండియా పాకిస్తాన్  సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.  పాకిస్తాన్ ఇండియాపై పితూరీలు చెప్పడంమానుకోవడంలేదు .  అంతర్జాతీయంగా ఇండియాను ఇరుకున పెట్టాలని చూస్తోంది.  పాక్ కు చైనా, టర్కీ, మలేషియా మద్దతు ఇస్తున్నాయి.  ఏ మూడు దేశాల మద్దతుతో పాక్ రెచ్చిపోతున్నది.  ఐరాసలోని మిగతా దేశాలు ఇండియాకు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  రెండు దేశాల మధ్య పీవోకే విషయంలో మూడో జోక్యం అవసరం లేదని ఇండియా చెప్తుంటే.. మూడో దేశం కలిగించుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అంటోంది.  


కానీ, ఇండియా అందుకు ఒప్పుకోవడం లేదు.  కాగా, ఇప్పుడు ఇండియాకు మరింత మద్దతు లభిస్తోంది.  ఎఫ్ఏటిఎఫ్ విషయంలో పాక్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  పాక్ ను ప్రస్తుతానికి గ్రే లిస్టులో ఉంచి ఫిబ్రవరిలో మరోసారి రివ్యూ చేసి పాక్ విషయాన్ని చూసుకుంటారట.  ఇండియాలో ఉగ్రవాదులను పంపించి... కాశ్మీర్లో దాడులు చేయించాలని చూస్తోంది.  ఉగ్రవాదులను బోర్డర్ ద్వారా ఇండియాలోకి పంపించే సమయంలో వారికీ అండగా పాక్ సైన్యం ఇండియా బోర్డర్ పై కాల్పులు జరుపుతూ... చొరబడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఉగ్రవాదుల నిర్మూలన విషయంలో పాక్ సీరియస్ గా తీసుకోవాలని, ఉగ్రవాదులను ఏరివేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.  అమెరికాలో ఇటీవలే పాక్ బృందం పీవోకేలో పర్యటించింది.  పీవోకేలో పర్యటించిన అమెరికా బృందం అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీసింది.  దానిపై రిపోర్ట్ తయారు చేసింది.  ఈ రిపోర్ట్ పై అమెరికాకూడా సీరియస్ అయ్యింది.  


అంతేకాదు,  పాక్ ఉగ్రవాద నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇండియాకు నమ్మకం ఏర్పడేలా పాక్ ప్రవర్తించేలా చూడాలని అమెరికా హెచ్చరిస్తోంది.  ఇక ఇండియా తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని అమెరికా సమర్ధించింది.  ఆర్టికల్ 370 రద్దు చేసే ముందు కాశ్మీర్ లో ఇండియా తీసుకున్న  జాగ్రత్తలను అమెరికా అభినందించింది. ప్రస్తుతం కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయని అమెరికా పేర్కొన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: